ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో..ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో కూడా కొత్త నాయకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగార్జున యూనివర్శిటీ దగ్గర శుక్రవారం నిర్వహించిన శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా.. జనసేనానిని నాదెండ్ల మనోహర్ కలిశారు. తర్వాత పవన్ తో ప్రత్యేకంగా సమావేశమైన నేపథ్యంలో.. మనోహర్ జనసేనలో చేరతారా? అనే ఊహాగానాలు బయల్దేరాయి.ముందస్తు ఎన్నికలు ఖాయమన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో నాదెండ్ల కూడా తన రాజకీయ భవిష్యత్తు జనసేనలో చేరతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే దీనికంటే హాట్ టాపిక్ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది..అదే నాదెండ్ల మనోహర్ కు పీసీసీ చీఫ్ పదవి.
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఉండనుందని సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఊమెన్ చాంది ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టే ఆలోచనలో ఉన్నారని, అందులో భాగంగా కొత్త అధ్యక్షుడు రానున్నారని సమాచారం.ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి బదులుగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను అద్యక్షుడిని చేయవచ్చని తెలుస్తోంది. 2011 జూన్ లో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అలా ఉమ్మడి రాష్ట్రంలో కీలక నాయకుడిని ఈ పదవికి ఎంచుకోవచ్చని అంటున్నారు.
అయితే, నాదెండ్ల నియామకం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే సందేహం తెరమీదకు వస్తోంది. నాదెండ్ల విషయంలో వ్యక్తిగతంగా అభ్యంతరాలు ఏవీ లేనప్పటికీ ఆయన్ను చీఫ్ గా చేసినప్పటికీ కాంగ్రెస్ పుంజుకుంటుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నాటి ఆగ్రహం ఇంకా కాంగ్రెస్ పై చల్లారలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాదెండ్ల నియామకం ఆ పార్టీకి పునర్ వైభవం ఇస్తుందా అనే సందేహం కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమవుతోంది.