మెగా బ్రదర్ ఈసారి మీడియాపై పడ్డారు. ఓ రేంజ్ లో తన వీడియోతో ఏకిపారేశాడు. ‘నా చానెల్ నా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో వరుసగా తెలుగు రాజకీయాల్లోని లొసుగులు ఎత్తిచూపుతున్న ఆయన వివిధ రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఆయన మీడియాపై ఫోకస్ చేశారు. తన సోదరుడు, ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేనపై విషం కక్కుతున్న మీడియాపై విరుచుపడ్డారు.
రాజకీయ పార్టీలకు అమ్ముడపోయిన కొన్ని మీడియా చానెల్స్, పత్రికలు గడ్డి తినడానికి కూడా వెనుకాడడం లేదనే సందేశం వచ్చేలా నాగబాబు వీడియోలో స్కిట్ ప్రదర్శించి.. అందులో మీడియా అధినేతల పేర్లను ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించారు.
ఈ వీడియోలో స్కిట్ లో భాగంగా నాగబాబు భగవాన్ బాబా మహారాజ్ వేషం వేశారు. ఇక నీతివంతమైన మీడియా పాత్రలో జబర్ధస్త్ కమెడియన్ అదిరే అభి.. అవినీతి గడ్డితినే మీడియా గన్నయ్య పాత్రలో రాము నటించాడు. ఫ్యాన్ కింద గడ్డి తిరి సైకిల్ వేసుకొని ఎక్కడి దొరికితే అక్కడ గడ్డి తింటున్నాని రాజకీయ పార్టీలను, వారి అనుకూల మీడియాను నాగబాబు సెటైర్ గా విమర్శించాడు.
ఇక మీడియా - ఆ మీడియా అధినేతలు - ఫేమస్ జర్నలిస్టుల పేర్లతో కూర్చిన పాటను నాగబాబు వినిపించి వారిని తిట్టిపోశారు. జనాలు నిజం తెలిసిన తర్వాత మీ దుంప తెంచేస్తారు.. ఇప్పటికైనా సొమ్ముకు అమ్ముడు పోవద్దంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
Full View