శ్రీమంతుడిలా నాగబాబు.. ఏం చేయబోతున్నారు?

Update: 2019-07-28 07:19 GMT
మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శ్రీమంతుడు’. అందులో మహేష్ కు నాన్నగా నటించిన జగపతి బాబు తన సొంతూరును వదిలేసి సిటీలో కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు. కన్న ఊరిని మరిచిపోతాడు. కొడుకు మహేష్ కు ఆ విషయం తెలిసి ఆ ఊరిని ఉద్దరిస్తాడు. అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కునే పరిస్థితి అన్న మాట..

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. ఈ విషయంలో టాలీవుడ్ ను ఏలిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. వీరి సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో వీరిద్దరూ విఫలమయ్యారు. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవిని - జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ కు సొంత జిల్లా ప్రజలు షాక్ ఇచ్చి ఓడించారు.

ఇక నాగబాబు కూడా మొన్నటి ఎన్నికల్లో తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలోనే నర్సాపురం ఎంపీగా పోటీచేశారు. ఆయన చిత్తుగా ఓడిపోయారు. చిరంజీవి - పవన్ సొంత ఇలాకాలో ఓడిపోగానే అటు వైపు చూసిన దాఖలాలు లేవని విమర్శలు వచ్చాయి. కానీ దానికి భిన్నంగా నాగబాబు అడుగులు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నాగబాబు ఓడిన చోట వెతుక్కోవాలని డిసైడ్ అయినట్టు అర్థమవుతోంది. ఇటీవల జనసేన కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన నాగబాబు ఇక నెలలో వారం రోజుల పాటు నర్సాపురంలోనే ఉంటానని డిసైడ్ చేశారు. అంతేకాదు.. ఇటీవల దాడుల్లో చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఒంటరిగా పోటీచేయాలని.. తాను ప్రచారం చేస్తానని.. టికెట్లు ఇస్తానని ప్రకటించి కార్యకర్తల్లో జోష్ నింపారు.

ఓటమితో జనసేన పని అయిపోందని కాడి వదిలేసిన జనసేన కార్యకర్తలు ఇప్పుడు నాగబాబు దూకుడు.. యాక్టివ్ పాలిటిక్స్ తో మళ్లీ యాక్టివ్ అవుతున్నారట.. చిరు - పవన్ వదిలేసినా నాగబాబు వదలకుండా సొంత జిల్లాలో వైసీపీ టార్గెట్ గా.. 2024 పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పోయినచోటే గెలవాలని చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది.


Tags:    

Similar News