సుప్రీంకోర్టులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి తీవ్ర షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతనని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ సతీమణి అయినంత మాత్రాన అది అదనపు అర్హత అవుతుందా అని సుప్రీంకోర్టు మండిపడింది.
ఒకరి ఆస్తులు గురించి తెలుసుకోవడానికి మీకేం హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని లక్ష్మీపార్వతికి కోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పిటిషన్‌ను ఇప్పటికే మీరు హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టేసిందని దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఆ పని చేసిందని వెల్లడించింది.
లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశంలో ఎలాంటి విలువ లేదని ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాగా చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ గతంలో లక్ష్మీపార్వతి హైకోర్టులో పిటిషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ట్రయల్ కోర్టులో, హైకోర్టులో లక్ష్మీపార్వతి చేసిన పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి.
చంద్రబాబుకు, లక్ష్మీపార్వతికి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని కూడా గతంలోనే హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాజకీయ కారణాలు, వ్యక్తిగత విభేదాలతోనే ఆయనపై లక్ష్మీపార్వతి కేసు వేసిందని ప్రతివాది తరఫు వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్‌ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
కాగా నందమూరి లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆమెను తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్‌గా జగన్ ప్రభుత్వం నియమించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.