మహిళలు మగవారి పరిచయాల కోసమే ఫేస్ బుక్ లు చూస్తున్నారా? మహిళల స్నేహాలు కేరక్టర్ లేని వారితో ఉంటున్నాయా? అందుకే మహిళలు మోసపోతున్నారా?... అంటే టీడీపీ సీనియర్ నేత - రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఔననే అంటున్నారు. సైలెంట్ గా ఉంటూనే మహిళలు - విద్యార్థినులపై ఆమె సవారీ చేసేశారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని - కనీస సంఖ్యలో కూడా మహిళా పోలీసులు లేకపోవడం వల్లే మహిళలు కనీసం పోలీస్ స్టేషన్లకు వెళ్లలేని పరిస్థితి వస్తోందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అయితే, నన్నపనేని మాత్రం మహిళల వల్లే అన్ని సమస్యలూ వస్తున్నాయన్నట్టుగా వారిని ఉతికి ఆరేశారు.
అంతేకాదు, ఇటీవల రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన కాలేజీల్లో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడంపైనా నన్నపనేని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఎక్కువగా చేరడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని సంబంధం లేని కామెంట్లు చేసి.. మంత్రి నారాయణ సంస్థలను గట్టెక్కించే కామెంట్లు కుమ్మరించారు. విషయంలోకి వెళ్తే.. గుంటూరులోని మహిళా కమిషన్ కార్యాలయంలో నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించొచ్చా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. క్యారెక్టర్ లేని వారితో స్నేహాలు - ఫేస్ బుక్ పరిచయాల ద్వారా మోసపోవడం వల్లే విద్యార్థినులు - మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నొక్కి చెప్పారు.
అంతేకదు, కళాశాలల్లో విద్యార్థినుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులెవరూ యాజమాన్యం ఒత్తిడి వల్లే మరణిస్తున్నామంటూ సూసైడ్ నోట్ రాయలేదన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో తరుచూ ఆత్మహత్యలు చోటుచేసుకోవడానికి కారణం.. అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదవడమేనని చెప్పుకొచ్చారు. ఒత్తిడి ఉంటే చదువు మానేయాలే గానీ ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు. దీంతో మీడియా మిత్రులకు నోట మాట కరువైంది! నన్నపనేని ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. అంటూ బయటకు వచ్చారు!