తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో జరుగుతున్న తెదేపా శిక్షణ శిబిరాల తొలి రెండోరోజుల కార్యక్రమాలకు గైర్హాజరవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమయింది. దీనిపై సోషల్ మీడియా - పార్టీ వ్యతిరేక మీడియాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తాయి. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి, శిక్షణ శిబిరాలకు డుమ్మా కొట్టారని తీవ్రస్థాయి ప్రచారం జరిగింది. రెండోరోజు కూడా హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే .. మూడో రోజు కార్యక్రమాలకు గురువారం ఉదయాన్నే ఆయన హాజరుకావడంతో పార్టీ శ్రేణుల్లో అనుమానాలు తొలగాయి. కానీ.. మీడియాలో ఆ విషయం రచ్చ అవుతున్నందునే ఆయన వచ్చారు కానీ, అలక వీడలేదన్న వాదనా వినిపిస్తోంది. మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంపై కంప్యూటర్ ల్యాబ్ లో నాయకులకు ఇస్తున్న శిక్షణ తీరును లోకేశ్ పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా తొలి రెండు రోజుల కార్యక్రమాలకు ఆయన రాకపోవడంపై పలువురు నేతలు లోకేశ్ వద్ద ప్రస్తావించారని.. వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం చెప్పగా లోకేశ్ అందుకు కారణం కూడా చెప్పారని తెలుస్తోంది. గత పది రోజులుగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్న క్రమంలో రాలేకపోయానని చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు లోకేశ్ అలిగారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీ సారథి ఆయనేనని.. ఈ శిక్షణ తరగతుల కోసం కూడా ఆయన చాలా శ్రమించారని.. రోజుకు 15 గంటలు పార్టీ కోసమే పనిచేస్తున్నారని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి పదవి ఇవ్వలేదని తండ్రిపై అలిగే పరిస్థితే లేదని చెబుతున్నారు. లోకేశ్ కు మంత్రి పదవి హామీ దొరికిందో లేదో కానీ ఆయన శిక్షణ తరగతులకు రావడంతో ఊహాగానాలకు మాత్రం తెరపడనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/