ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లె వీఐపీలతో హడావుడిగా మారింది. చంద్రబాబు మనవడు - లోకేశ్ కుమారుడు దేవాన్ష్ కు తలనీలాలు తీయించేందుకు గురువారం సాయంత్రమే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబం శుక్రవారం ఉదయం 7 గంటలకు స్థానిక నాగాలమ్మ గుడికి వెళ్లింది. నాగాలమ్మతల్లి కట్ట చుట్టూ చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల దైవమైన నాగాలమ్మకు తన మనవడు దేవాన్ష్ తలనీలాలను సమర్పించారు.
నారా - నందమూరి కుటుంబాలకు చెందిన 25 మంది ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నారా కుటుంబంతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఒకేసారి గ్రామానికి రావడంతో నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు కంటే ముందుగానే ఆయన బావమరిది - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు - చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర - కోడలు నారా బ్రాహ్మణిలు చిన్నారి దేవాన్ష్ తో కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా గురువారమే సొంతూరుకు వచ్చిన చంద్రబాబు అక్కడ ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని వారికి హామీ కూడా ఇచ్చారు.