ఆయనకు అర్హత ఉన్నదని - పార్టీలో అందరూ ఫీలవుతారు.. కానీ... పాపం! మంత్రి పదవి మాత్రం దక్కదు. ఇదీ తెలుగుదేశంలోని కిమిడి కళా వెంకట్రావు పరిస్థితి. పార్టీకి అత్యంత విధేయుడు. ఆ కోటాలోనే ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంది. తీరా ఇప్పుడు చంద్రబాబు 'చేసేస్తా' అంటున్న విస్తరణలో ఆయనకు పదవి గ్యారంటీ అని అందరూ భావించారు. అయితే.. తాజాగా నారా లోకేష్ మాటలను బట్టి.. మళ్లీ కళా వెంకట్రావుకు హ్యాండిచ్చినట్టే అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో కలుగుతోంది.
అమరావతిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలకు తొలి రెండు రోజులు డుమ్మా కొట్టి.. మూడోరోజు మాత్రం వచ్చిన లోకేష్.. విస్తరణ అనేది పార్టీ అధినేత ఎప్పుడు తలచుకుంటే అప్పుడు చేస్తారని అంటూనే.. తెలుగుదేశంలో ఒక వ్యక్తికి ఒకే పదవి సిద్ధాంతం అమలవుతుందని అన్నారు. ఇప్పుడు పార్టీ నాయకుల్లో అదే పెద్ద చర్చగా ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టడం కష్టం కదా? అని పలువురు విశ్లేషిస్తున్నారు.
కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన ఆయన మరదలు కిమిడి మృణాళిని ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. కళాను తీసుకోవడం అంటే.. ఖచ్చితంగా ఆమెకు ఉద్వాసన పలకడమే.. ఆమె స్థానంలో కళాకు అవకాశం ఇస్తే.. మళ్లీ మహిళల కోటా పూరించడానికి మరో ఎక్స్‌ట్రా మహిళకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందేమోనని.. ఇన్ని చికాకులు పడే బదులు.. కళాను దూరం పెట్టి.. బుజ్జగిస్తే సరిపోతుందని చంద్రబాబు భావించి ఉండొచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/