టీడీపీ యువనేత నారా లోకేష్ మరో సారి తెరాస మంత్రిపై తనదైన శైలిలో ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు గుడుంబాతో ప్రజల ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని...అదే చీప్ లిక్కర్ వల్ల ప్రజలు ప్రాణాలు కాపాడతం అంటూ పద్మారావు వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. ఇంటింటికి మద్యం నల్లాలు వేయించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా దీనిపై నారా లోకేష్ కూడా స్పందించాడు. చీప్ లిక్కర్ తాగండంటూ మంత్రి పద్మారావు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పారని...పద్మారావు ఓపెన్ గా లిక్కర్ ను మార్కెట్ చేస్తున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. బంగారు తెలంగాణ ఇదేనా అని అని ఆయన ధ్వజమెత్తారు. లోకేష్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రతిపక్షాలని ఒకే తాటి పైకి వచ్చి విమర్శలు చేస్తున్నాయి. అయినా కేసీఆర్ సర్కార్ మాత్రం తాము చాలా తక్కువ ధరలకే మద్యం ఉత్పత్తి చేస్తున్నామంటూ పట్టువీడకుండా వెళుతోంది. తాజాగా ఇదే అంశంపై లోకేష్ పద్మారావును లిక్కర్ మార్కెటర్ అని విమర్శించడం తెరాస వర్గాల్లో కాకరేపుతుంది. ఈ ట్విట్లకు వారినుంచి రిప్లే ఎలా ఉంటుందో...ఎంత ఘాటుగా ఉంటుందో చూడాలి.