నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ పరుగులు తీసే బిజీగా ఉండే పరిస్థితి. అందుకు భిన్నంగా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి లాక్ డౌన్ పుణ్యమా నెలకొంది. ఇలాంటివేళలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు కమ్ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో బయటకు రాని ఆయన.. ఈ మధ్యనే ఏపీకి రావటం తెలిసిందే. వర్చువల్ మహానాడులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్దిమంది టీడీపీ నేతలు లోకేశ్ లో వచ్చిన మార్పును చూసి షాక్ తిన్నారు.
గతంలో బొద్దుగా ఉండే చినబాబు.. బక్కచిక్కిని వైనంతో ఏమైందన్న ఆసక్తి వ్యక్తమైంది. లాక్ డౌన్ రెండు నెలల్లో ప్రత్యేక శిక్షణలో భాగంగా తాను బరువు తగ్గినట్లు లోకేశ్ చెప్పటంతో తమ్ముళ్లలో ఆసక్తి వ్యక్తమైంది. లాక్ డౌన్ వేళ రోజుకు నలభై నుంచి గంట పాటు చేసిన ప్రత్యేక వ్యాయామంతో ఏకంగా 20 కేజీలు తగ్గిపోవటంతో చినబాబు బక్కచిక్కినట్లుగా మారారు.
వ్యాయామంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవటంతో బరువు తగ్గటం సాధ్యమైందని చెప్పారు. నైక్ ట్రైనింగ్ క్లబ్ మొబైల్ యాప్ లోని సూచనల్ని తాను పాటించినట్లుగాచెప్పారు. యాప్ లో చెప్పినట్లుగా వ్యాయామం చేయటం.. చెన్నైకి చెందిన డైటీషియన్ చేసిన సూచనలతో తాజా లుక్ సాధ్యమైందని చెబుతున్నారు. కొట్టేచ్చే మార్పుతో మహానాడు లో లోకేశ్ మహానాడు లో హాట్ టాపిక్ గా మారారు.