టీడీపీ అధినేత కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎలా తగ్గాడు? అంత బరువుగా ఉండే అతడు మరీ సన్నపూస ఎలా అయ్యాడు? ఈ రెండు నెలల లాక్డౌన్ లో ఎందుకిలా తయారయ్యాడు. ఉబకాయం నుంచి స్మార్ట్ గా ఎందుకయ్యాడు? ఈ ప్రశ్నలన్నీ టీడీపీ శ్రేణులను తొలిచేస్తున్నాయి. దానికి సమాధానం తెలుసుకునే పనిలో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారట..
‘‘కొందరు ఇంజెక్షన్లు అంటే.. కొందరు కొవ్వు తగ్గించాడంటున్నారు.. మరికొందరు లైపో చికిత్స తీసుకున్నాడంటున్నాడని..’’ ఇలా డిజిటల్ మహానాడులో మాట్లాడుకుంటున్నారు.. అసలు విషయం ఏంటంటే ఈ లాక్ డౌన్ వేళ అన్నం పప్పు పూర్తిగా మానివేసి కేవలం డ్రైఫ్రూట్స్, తాజా పండ్లు, వాకింగ్ బాగా చేసి తగ్గాడు అని ఎన్టీఆర్ భవన్ లో అనుకుంటున్నారట..
ఇదంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారు మన చినబాబు లోకేష్ బాబు గురించి.. భావి తెలుగు దేశం పార్టీ వారసుడు.. చంద్రబాబు కుమారుడు లోకేష్.. లాక్ డౌన్ అనంతరం అవతారం చూసి కథలు కథలుగా చెబుతున్నారు. లావుగా ఉండే లోకేష్ ఇంత స్మార్ట్ గా ఎలా తయారయ్యాడబ్బా అని ఆరాతీయగా.. ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
లోకేష్ బాబు.. ఆయన బాబు చంద్రబాబు కూడా ఈ లాక్ డౌన్ కు ముందే హైదరాబాద్ వెళ్లి వారి సొంత ఇంట్లో బందీ అయిపోయారు. మహమ్మారి విస్తరించడం.. కేసులు పెరగడం.. లాక్ డౌన్ పొడిగించడంతో రెండు నెలలు బయటా మీడియాలో కనిపించలేదు. ఈ రెండు నెలల్లో చంద్రబాబు లో ఏమార్పు కనిపించలేదు. కానీ లోకేష్ లో మాత్రం మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది.
లావుగా దిట్టంగా ఉండే లోకేష్ బాబు సన్నగా నల్లపూస అయిపోయాడు. ఆయన అవతారం చూసి టీడీపీ నేతలు, శ్రేణులే షాక్ అయ్యారు. లోకేష్ ఇలా ఎలా మారాడని అందరూ ఆరాతీశారు. చివరకు ఇలా అన్నం పూర్తిగా మానేసి పండ్లు, పరిగెత్తి సన్నబడ్డాడని అంటున్నారు.
ఆ మధ్య కుమారుడితో లాక్ డౌన్ వేళ హైదరాబాద్ రోడ్లపై తిరిగిన సమయంలోనూ లోకేష్ కాసింత లావుగానే కనిపించాడు. ఈ రెండు నెలల్లో ఎంతో కసరత్తు చేసి మరీ ఈ స్థితికి వచ్చాడని తెలుస్తోంది.