ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. కొడుకును ఈ మధ్యనే మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు.. తాజాగా తాను చేస్తున్న అమెరికా పర్యటనకు వెంట తీసుకెళ్లటం లేదన్న విషయం ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల మొదటి వారం (మే 3 నుంచి 12 వరకు) వరకూ అమెరికాలో పర్యటించనున్నారు చంద్రబాబు.
ఏపీకి ఐటీమంత్రిగా ఉన్న లోకేశ్.. ఈ పర్యటనలో తప్పనిసరిగా భాగస్వామ్యం అవుతారన్న ప్రచారం సాగింది. అయితే.. అందుకు భిన్నమైన సమాచారం తాజాగా బయటకు వస్తోంది. బాబు అమెరికా టూర్ లిస్ట్ లో లోకేశ్ పేరు లేదని చెబుతున్నారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. మంత్రి యనమల రామకృష్ణుడు.. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్.. ఐటీ సలహాదారు జే.ఎ. చౌదరి.. ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్.. ఉన్నతాధికారులు సాయి ప్రసాద్.. అజయ్ జైన్.. తదితరులు ఉన్నట్లు చెబుతున్నారు.
తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు టూర్ సాగుతుందని చెబుతున్న వేళ.. ఆయన వెంట కుమారుడ్ని వెంట పెట్టుకోకుండా వెళుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఈ వ్యవహారంపై టీడీపీ వర్గాల వాదన వేరుగా ఉంది. ముఖ్యమంత్రి లేని వేళలో.. రాష్ట్రంలో పాలనకు సంబంధించిన కీలక బాధ్యతల్ని లోకేశ్ చూసే అవకాశం ఉందని.. ఇంతకాలం తెర వెనుక పావులు కదిపిన ఆయన.. బాబు లేని సమయంలో తానే మొత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని.. అందుకోసమే బాబు తనతో చినబాబును తీసుకెళ్లటం లేదని చెబుతున్నారు. మరి.. బాబు అమెరికా టూర్ సందర్భంగా చినబాబు యాక్షన్ ఏపీలో ఎలా ఉంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/