ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాట్లాడే విషయంలో తడబడుతున్నారా? నిన్నమొన్నటి వరకూ ట్విట్టర్ పిట్టతో నాలుగు మాటలు చెబుతూ.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. నేతలు.. కార్యకర్తలు.. మీడియాను ఉద్దేశించిన మాట్లాడింది తక్కువే. తాజాగా విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యాంటీ ర్యాగింగ్ సమావేశం జరిగింది. దీనికి లోకేశ్ అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన చేసినట్లుగా చెబుతున్న మాటలు వివాదంగా మారాయి. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో ప్రస్తావించిన మాటలు పలు విమర్శలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం.
తన దగ్గరకు గూగుల్ లో ఉద్యోగాలకు రికమండ్ చేయమని పలువురు వస్తుంటారని.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తనకే గూగుల్ లో ఉద్యోగం రాలేదని.. అలాంటిది మీకెలా వస్తుందని చెప్పి తాను వెనక్కి పంపుతానంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లోకేశ్ కు గూగుల్ లో ఉద్యోగం రానప్పటికీ.. ఇప్పటికే పలువురు తెలుగు వారు వందల సంఖ్యలో గూగుల్ లో ఉద్యోగాలు సంపాదించిన విషయం మర్చిపోకూడదు. గూగుల్ లో ఉద్యోగాలు రావటం ఎంత కష్టమో చెప్పే కన్నా.. ఎలా ప్రయత్నిస్తే వస్తాయన్న విషయం మీద లోకేశ్ మాట్లాడితే బాగుండేది. రికమండేషన్ తో ఉద్యోగాలు రావన్న విషయాన్ని చెబితే సబబుగా ఉండేది.
అలా కాకుండా.. అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు విమర్శలకు తావిచ్చేలా ఉంది. లోకేశ్ నోటి వెంట వచ్చిన గూగుల్ మాట.. పార్టీకి గుగ్లీలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులతో కానీ మరెవరితోనైనా కానీ మాట్లాడే అంశాల మీద కాస్తంత హోంవర్క్ చేస్తే బాగుంటుందన్న సూచన వినిపిస్తోంది.