రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దైవభక్తి గురించి తెలియని తెలుగువాడు ఉండడు. దేవుడ్ని విపరీతంగా కొలిచే ఆయన.. గతంలో చీమ చిటుక్కుమన్నా తిరుమల బాలాజీ దర్శనం చేసు కోవటానికి పరుగులు పెట్టేసేవారు. ఇప్పటిని నిత్యం ఖైరతాబాద్ కూడలికి దగ్గరగా ఉండే దేవాలయానికి వెళ్లే ఆయన పూజల విషయంలో అస్సలు వంక పెట్టాల్సిన అవకాశమే ఉండదు. తిరుమల బాలాజీని అమితంగా ఆరాధించే ఆయన గతంలో నెలకు రెండు సార్లు కూడా వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో సూటు..బూటుతో ఐపీఎస్ వాసనల్ని విడిచిపెట్టనట్లుగా ఉండే ఆయన.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మొత్తంగా మారిపోతారు. పంచె తప్పించి.. పైన వస్త్రం అంటూ లేకుండానే దర్శనానికి వెళ్లిపోతారు. భక్తుడి రూపంలో ఆయన్ని చూసిన కొత్తవాళ్లు అయితే.. ఆయనే గవర్నర్ అంటే ఆశ్చర్యపోవటం ఖాయం. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అసలుసిసలు వైష్ణవరూపంలో కనిపించే ఆయన చాలా నిష్టగా పూజ చేస్తుంటారు.
అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు తిరుమల బాలాజీ దర్శనానికి వెళ్లిన గవర్నర్ ఎప్పటి మాదిరే పైన ఎలాంటి వస్త్రం లేకుండానే తిరు వీధుల్లో (వాహనం వదిలిన దగ్గర నుంచి ఆలయ ముఖద్వారం వరకు) ప్రధాని వెంట నడిచారు. అనంతరం లోపలకు వచ్చిన సందర్భంగా ఒక చిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. గవర్నర్ కారణంగా భద్రతా వర్గాలు మింగాలేక... కక్కాలేని పరిస్థితిలో ఆయన వంక చూస్తుండిపోయారు. ఇంతకీ శ్రీవారి ఆలయంలో ఏం జరిగిందంటే..
ప్రధానితో పాటు ఆయన ఆలయం లోపలకు వెళ్లారు. మోడీకి కాస్త వెనుక ఉన్న గవర్నర్.. మోడీ ధ్వజస్థంభానికి నమస్కారం పెట్టి వెళ్లగానే గవర్నర్ వంతు వచ్చింది. మామూలుగా అయితే.. నమస్కారం పెట్టేస్తారని భద్రతా సిబ్బంది భావించాయి. అయితే హటాత్తుగా ఆయన ధ్వజస్థంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని వెనుకనే గవర్నర్ ఉండటంతో ఆయన్ను దాటి వెళ్లలేని పరిస్థితి. అందులోకి ఆయన సాష్టాంగ నమస్కారం పెట్టటంతో ఒక్కసారిగా వారంతా ఆగిపోయారు.
ఒక సాష్టాంగ నమస్కారంతో సరిపుచ్చుతారని భావించిన భద్రతా సిబ్బంది గవర్నర్ మొదటి సాష్టాంగ నమస్కారం పూర్తి అయిన వెంటనే అడుగు ముందుకు వేశారు. కానీ.. ఆయన మరికొన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేయాల్సి ఉండటంతో ఆయన్ను దాటలేక.. ముందుకు వెళ్లలేక భద్రతా సిబ్బంది ఆగిపోయారు. దాదాపుగా ఐదుకు పైనే సాష్టాంగ నమస్కారాలు పెట్టటం.. అది అయ్యే వరకూ భద్రతా సిబ్బంది వెనకే ఉండిపోవాల్సి వచ్చింది.
గవర్నర్ ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తారో అంచనా లేని భద్రతా సిబ్బంది.. ఆయన ప్రతి సాష్టాంగ నమస్కారం పూర్తి అయిన వెంటనే అడుగు ముందుకేసే ప్రయత్నం చేయటం.. గవర్నర్ కిందకు వాలటంతో చటుక్కున వెనక్కి అడుగేయటం కనిపించింది. అయితే.. భక్తి పారవశ్యంలో ఉన్న గవర్నర్ భద్రతా సిబ్బంది ఇబ్బందిని గుర్తించలేదు. గవర్నర్ తాను చేయాల్సిన సాష్టాంగ నమస్కారాలు పూర్తి అయిన వెంటనే చెంగున ముందుకు దుమికి ప్రధానిని కలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్న దృశ్యం కనిపించింది. గవర్నర్ సాష్టాంగ నమస్కారాలు ఏమో కానీ భద్రతా సిబ్బందికి మాత్రం చుక్కలు కనిపించాయి.