లక్ష్యం ఎవరైతే వారిని లక్ష్యంగా చేసుకోవాలే కానీ.. అందుకు భిన్నంగా మాట్లాడే మాటలతో వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరీ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎందుకు మిస్ అయినట్లు? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా పాల్గొన్న సభలో మాట్లాడుతూ ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.
తాను విభేదించే నేత పేరును ప్రస్తావించకుండా.. సదరు నేత సామాజిక వర్గాన్ని ప్రస్తావించటం వల్ల లాభమేంది? అన్నది ప్రశ్నగా మారింది. చిత్తూరు జిల్లా పెనుమూరు ఎండీపీవో ఆఫీసులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన తన నోటికి పని చెప్పారు. తనతో విభేదించే మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన.. తన మాటలతో విరుచుకుపడ్డారు. తన టార్గెట్ జ్ఞానేంద్ర రెడ్డి అయినప్పుడు.. ఆ విషయాన్ని వదిలేసి.. అందుకు భిన్నంగా రెడ్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది.
ఇంతకూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నదేమంటే.. "కోటీశ్వరులైన రెడ్లే నన్ను తిడుతున్నారు. ఇంకెవరూ నన్ను అసలు వ్యతిరేకించటం లేదు. నా సాయంతో పదవులు పొందిన వారే నన్ను విమర్శిస్తున్నారు. కొందరు నాయకులు నా ద్వారా పదవులు పొంది నన్నే విమర్శించటం మంచిది కాదు. నేను ఎన్నికల్లో రెడ్ల వల్లనే గెలుపొందానని.. ఆ వర్గంలోని కొందరు పెత్తందార్లు నాపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు" అంటూ ఆయన మాట్లాడారు. ఆయన మాటలన్ని కూడా మాజీ ఎంపీ.. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుగా వ్యవహరిస్తున్న జ్ఞానేంద్ర రెడ్డిని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు.
తాను పదవి కంటే ఆత్మాభిమానంతో బతుకుతానని.. ఉప ముఖ్యమంత్రిని కాబట్టి తల వంచుకుపోతున్నట్లుగా పేర్కొన్నారు. 'ఎవరికయ్యా నేను అన్యాయం చేసింది. ఓ వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నాడు. నేను రెడ్లను తిడుతున్నానట. ఇక్కడ ఉండేది మీరంతా రెడ్లు కాదా? నేను రెడ్ల సహకారంతో సమితి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు గెలుస్తున్నా. ఎవరైతే జగన్ మోహన్ రెడ్డిని తిడతారో వారినే నేను తిడుతున్నా.
నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే నేరుగా వచ్చి మాట్లాడమనండి. ఎవరూ బానిసలుగా బతకరాదనేది ఉద్దేశం' అంటూ ఫైర్ అయ్యారు. నారాయణ స్వామి మాటల్ని విన్నప్పుడు.. తనను ఇరుకున పెట్టే జ్ఞానేంద్ర రెడ్డిని వదిలేసి.. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి అన్వయించేలా డిప్యూటీ సీఎం మాటలు ఉన్నాయంటున్నారు. అయినా.. ఒకరి మీద ఉన్న కోపం ఊళ్లో ఉన్న ఒక సామాజిక వర్గం మొత్తానికి అపాదించేలా మాట్లాడటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.