కేసీఆర్ ను మోడీషాలు ఎంత‌లా న‌మ్మారంటే?

Update: 2018-08-28 05:54 GMT
ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అదే రీతిలో ఒక్కో ప్ర‌భుత్వం ఒక్కోలా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన మోడీ స‌ర్కారు సంగ‌తే తీసుకుంటే.. తాము తీసుకునే నిర్ణ‌యాన్ని సొంత పార్టీ నేత‌ల‌తో ఒక్క‌సారి చ‌ర్చిస్తుంటారు. త‌మ పార్టీ అధికారంలో లేని రాష్ట్రానికి సంబంధించి ఏదైనా నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌నుకుంటే ముందుగా ఆ రాష్ట్ర బీజేపీ నేత‌ల్ని పిలిపించుకోవ‌టం.. వారితో చ‌ర్చించుకోవ‌టం.. వారి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం మామూలే.

ఏపీకి ప్ర‌త్యేక హోదా మొద‌లుకొని కీల‌క‌మైన అంశాల విష‌యంలో ఏపీకి చెందిన బీజేపీ నేత‌లతో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాతే.. ఏపీకి హ్యాండ్ ఇచ్చే ప్రోగ్రామ్ ను అమ‌లు చేయ‌టం తెలిసిందే. ఒక్క ఏపీలో విష‌యంలోనే కాదు.. ఏ రాష్ట్రంలోనైనా ఇదే విధానాన్ని అమ‌లు చేయ‌టం క‌నిపిస్తుంటుంది.

ఇందుకు భిన్నమైన విధానాన్ని తాజాగా అమ‌లు చేయ‌టం క‌మ‌ల‌నాథుల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. ముంద‌స్తుకు వెళ్లేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రం అభ‌యాన్ని కోర‌ట‌మే కాదు.. తాను తీసుకెళ్లిన డిమాండ్ల లిస్టును ఒక్క టూర్ తోనే కంప్లీట్ చేసుకొని రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రి తీసుకెళ్లే డిమాండ్ల చిట్టాను ఓకే చేసే స‌మ‌యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీనేత‌ల్ని పిలిపించి.. వారితో మాట్లాడిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకోవ‌టం ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ‌కు సంబంధించిన ఏ అంశాల్ని తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో మోడీషాలు చ‌ర్చించ‌లేద‌న్న విష‌యం హాట్ టాపిక్ గా మారింది. తాజా ప‌రిణామాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సొంత పార్టీ నేత‌ల కంటే కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను మోడీషాలు బాగా న‌మ్మిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని.. ఇలాంటిది ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేద‌న్న మాట క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. ఎలాంటి వారినైనా త‌న మాట‌ల‌తో స‌మ్మోహ‌నుల్ని చేసే శ‌క్తి ఉంద‌ని చెప్పే కేసీఆర్‌.. మోడీషాలు సైతం త‌న ఆక‌ర్ష‌ణ‌లో ప‌డిపోయేలా చేశార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News