పరిపాలకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న అపప్రదల్లో మొదటిది తప్పనిసరి అయినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొన్నింటిని పక్కన పెట్టేస్తారనే టాక్. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం సహా పలు ఇతర కీలక అంశాల్లోనూ సమస్య నిజమైనదే అయినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల బాబు తమ నోరు కుట్టేస్తారనేది పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి. ఇపుడు సేమ్ ఫార్ములాను చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీని తన కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు అరగంటకు పైగా పలు అంశాలపై చర్చించారు. మోడీతో సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరానన్నారు. ప్రత్యేక హోదా - రాష్ట్ర సమస్యలను ఇంకా నాన్చడం వల్ల నష్టమొస్తుందని - త్వరగా నిర్ణయం తీసుకుంటేనే ఉపయోగమని చెప్పానన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ప్రజల ఆందోళనకు కారణమైందని, విపక్షాలకు అనవసరంగా అవకాశం కల్పించినట్లవుతున్నదని మోడీకి తెలిపినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను ఆశిస్తున్నారని - ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవలసి వస్తుందని మోడీ దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు ఒత్తిడి చేయడాన్ని మోడీ తెలివిగా దాటవేసినట్లు తెలుస్తోంది. ''మీ సమస్య - మా సమస్య ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ లాగానే కేంద్రం వద్ద డబ్బులు లేవు. నిధులు వచ్చినప్పుడు తప్పక చూద్దాం'' అని మోడీ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఖిన్నుడైన బాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో త్వరలో పరిశీలించాలని మరోమారు ప్రధానమంత్రికి గుర్తుచేశారు.