అద్గ‌దీ మోడీ అంటే..?

Update: 2018-05-18 07:17 GMT
చుర్రుమ‌ని కాలిపోయేలా చేసి మ‌రీ కులాశాగా పలుక‌రించ‌టం సాధ్య‌మేనా? అంటే.. ఎలా కుదురుతుంద‌ని ప్ర‌శ్నించొచ్చు. కానీ.. ప్ర‌ధాని మోడీ తీరు చూసిన త‌ర్వాత మాత్రం ఇలాంటివి ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

సిద్ధాంతాలు వేరుగా ఉన్న‌ప్పుడు కూడా ఎదురుప‌డినంత‌నే ప‌లుక‌రించుకోవ‌టం.. మాట్లాడుకోవ‌టం లాంటివి చేస్తుంటారు. కానీ.. కీల‌క‌మైన రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న వేళ వ్య‌క్తిగ‌తంగా ఫోన్లు చేసుకోవ‌టం ఉండ‌వు. ప్ర‌ధాని మోడీ అలాంటి వాటికి మిన‌హాయింపు. ప్ర‌త్య‌ర్థిని సైతం త‌న‌కు తానే ప‌లుక‌రిస్తుంటారు. అయితే.. అదంతా మోడీకి ఉన్న అవ‌స‌రాన్ని బ‌ట్టి మాత్ర‌మే సుమా.

క‌ర్ణాట‌కలో ఏం జ‌రుగుతుందో అంద‌రికి తెలిసిందే. ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. నెంబ‌ర్ గేమ్ న‌డుస్తున్న వేళ‌.. అధికార‌ప‌క్షం.. విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేల్ని లాగాల‌ని చూస్తుంటే.. అధికార ప‌క్షం చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాకుండా ఉండేందుకు విప‌క్ష పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. త‌మ ఎమ్మెల్యేల్ని కాపాడేందుకు ఏకంగా హైద‌రాబాద్ కు షిఫ్ట్ చేసేశారు కూడా.

ఇదిలా ఉండ‌గా.. ఈ రోజు మాజీ ప్ర‌ధాని.. జేడీఎస్ నేత దేవెగౌడ పుట్టిన‌రోజు. దీంతో ఆయ‌న ఈ ఉద‌యం తిరుచానూరు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో ఆయ‌న అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకునే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా దేవెగౌడ‌కు ఆయ‌న బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.

మోడీ అన్నా.. ఆయ‌న పార్టీ అన్నా తీవ్రంగా వ్య‌తిరేకించే దేవెగౌడ‌కు ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ ఫోన్ చేయ‌టం.. బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌టం చూస్తే.. ఆయ‌న రాజ‌కీయ చాణుక్యం ఏ రేంజ్లో ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఓప‌క్క ప్ర‌య‌త్నాలు చేస్తున్న వేళ‌.. బ‌ల‌ప‌రీక్షకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. ప్ర‌ధానే నేరుగా దేవెగౌడ‌కు ఫోన్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ మాదిరి ఎక్క‌డ త‌గ్గాలో మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో?
Tags:    

Similar News