మోడీ శపథం.. ప్రియాంకకు షాక్

Update: 2019-05-09 05:46 GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మించి మోడీని టార్గెట్ చేసి  ప్రియాంక గాంధీ విరుచుపడుతున్న సంగతి తెలిసిందే. పరుష విమర్శలతో మోడీనికి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడీని దుర్యోధనడంటూ ఆమె మాట్లాడిన మాటలు సంచలనమమయ్యాయి. అయితే నిన్నటి వరకు రాహుల్ ను టార్గెట్ చేసి తిట్టిన మోడీ.. తాజాగా ప్రియాంకను, ఆమె భర్తను టార్గెట్ చేశారు. ఏకంగా ప్రియాంక భర్త రాబార్ట్  వాద్రాను జైలుకు పంపిస్తానని హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. రాబార్ట్ వాద్రాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ కాంగ్రెస్ హయాంలో రైతులను లూటీ చేసి భూములు లాక్కున్న రాబార్ట్ వాద్రాను కోర్టుకు ఈడుస్తామని.. మోసం చేసిన ఆయనను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి సొమ్ము కక్కిస్తానని.. వారిని జైలు గుమ్మం వరకూ తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని.. రాగానే చేసే మొదటి పని అదేనని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.

ఇక మోడీ విమర్శలకు ప్రియాంక భర్త రాబార్ట్ వాద్రా కూడా కౌంటర్ ఇచ్చారు. వరుస ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులతో మోడీకి సమాధానమిచ్చారు. ఐదేళ్ల నుంచి మోడీ ప్రభుత్వం తనను వేధిస్తోందని.. మానసిక ఒత్తిడికి కారణమవుతోందని విమర్శించారు. భారతదేశ చట్టాలు, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం గౌరవం ఉందని.. వాటితోనే ఎదుర్కొంటానని సవాల్ చేశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం,మహిళా సాధికారికత సహా ఎన్నో సమస్యలుండగా మోడీ తనను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పన్నుల శాఖను దుర్వినియోగం చేసి నోటీసులు పంపుతున్నాడని విమర్శించారు. అయినా ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేదని వాద్రా గుర్తు చేశారు.
    
    
    

Tags:    

Similar News