కేంద్ర బడ్జెట్ ను తీర్చిదిద్దిన తీరు, వివిధ కేటాయింపులను చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేత, మోడీ కొరకు, మోడీ వల్ల తెరమీదకు వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీకి ఇష్టమైన పథకాలకు జరిగిన భారీ కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మోడీ మానస పుత్రిక అయిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు 9,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో తెలిపారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బహిరంగ మల విసర్జనను సంపూర్ణంగా నిషేధించిన గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సహకాలిస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఐటీ మంత్రం జపించే మోడీ మూడ్ ను గమనించి స్టార్టప్ లకు జైట్లీ పెద్దపీట వేశారు. స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా పథకానికి రూ.500 కోట్లు బడ్జెట్ లో అరుణ్ జైట్లీ కేటాయించారు. స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్ కు ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. స్టార్టప్ ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్లపాటు నూరుశాతం పన్ను రాయితీ కల్పిస్తామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
ఆరు కోట్ల గ్రామీణ ఆవాసాలకు డిజిటల్ విద్య అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో ప్రకటించారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో కేంద్రం విదేశీ పెట్టుబడులకు వంద శాతం అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రకటించారు. ఎస్సీ - ఎస్టీ - మహిళా వ్యాపారవేత్తలకు స్టాండ్ అప్ పథకం కింద 500 కోట్లు కేటాయించారు. పీఎం ఔషధీ యోజన కింద దేశవ్యాప్తంగా మూడువేల మెడికల్ షాపులను ప్రారంభిస్తారు. కౌశల్ వికాశ్ యోజన కింద రానున్న మూడేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాల రంగానికి కొత్త రేటింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం, చమురు వెలికితీతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మోడీ మనసును గెలుచుకునేందుకేనని స్పష్టమవుతోంది.
సర్వం ఆధార్ మయం చేయడం కూడా మోడీ ఆలోచనలో భాగమే. ఆర్థిక సేవలు పొందాలనుకునే వారికి ఆధార్ ను తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక సేవల విషయంలో ఆధార్ ను తప్పని సరి చేస్తూ చట్టం తీసుకురానున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆధార్‌ను తప్పనిసరి కాదని చెప్పినప్పటికీ ఈ నిర్ణయం వెలువరించడం మోడీముద్రలో భాగమేనని విశ్లేషకులు చెప్తున్నారు.