భూత‌ల్లి కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదాం: ప‌్ర‌ధాని మోదీ!

Update: 2020-04-22 07:10 GMT
ప‌్ర‌పంచ ధ‌రిత్రీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రం భూమాతకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదామ‌ని ప్రధాని మోదీ  బుధవారం ట్వీట్‌ చేశారు. అపార‌మైన ప్రేమ‌తో స‌మ‌స్త జీవ‌కోటిని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న‌ భూమాత‌కు మ‌నం ఎంతో రుణ‌ప‌డి ఉన్నాం. మ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న అందరిపై ఉంది. భూగ్ర‌హాన్ని శుభ్రంగా - ఆరోగ్యంగా - అంత్యంత శ్రేయ‌స్క‌రంగా ఉండేలా చూసుకుంటామ‌ని ప్ర‌తి ఒక్క‌రం ప్ర‌తిజ్ఞ చేద్దాం అని ప్రధాని సూచించారు. 

అలాగే, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఈ భూమి మీద నుంచి తరిమికొట్టడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు.  1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే' ను నిర్వహించారని - పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రధాని తెలిపారు. కాగా పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుతాయి.



Tags:    

Similar News