రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ముందెన్నడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ఱ్ట విభజన గురించి ప్రత్యేకంగా ఎత్తుకుని నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. ఆయన పార్లమెంటులో మాట్లాడుతున్నారా లేదంటే ఏపీలో ఎన్నికల సభలో మాట్లాడుతున్నారా అన్నట్లుగా రాష్ర్ట విభజన నాటి పరిణామాలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీని ఎలా మోసం చేశాయి.. కాంగ్రెస్ నాయకులు గతంలో ఏపీ నేతలను ఎలా అవమానించారు వంటివన్నీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన నాటి పరిణామాలు.. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్న అంజయ్యను అవమానించడం, నీలం సంజీవరెడ్డి విషయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువంటివన్నీ గుర్తు చేస్తూ ఏపీని మొదటి నుంచి కాంగ్రెస్ చిన్నచూపు చూసిందన్న అంశాన్ని ఫోకస్డ్ గా చెప్పుకొంటూ వచ్చారు.
వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ‘ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మేం మద్దతు పలికాం. వాజ్ పేయి ప్రభుత్వం దీర్ఘదృష్టి కారణంగా మూడు రాష్ట్రాలు విభజించినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఎవరి వాటాలు ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు. నామమాత్రం ప్రతిపక్షం - ప్రసార మాధ్యమాలపై నియంత్రణతో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది’’ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కానీ - నెహ్రూ కానీ ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని.. తమిళనాడు - పంజాబ్ - కేరళ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్ గాంధీ అవమానించారంటూ అంజయ్య సీఎంగా ఉన్నప్పటి ఘటనలను గుర్తుచేశారు. నీలం సంజీవరెడ్డిని కూడా అవమానించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేసిన రాజకీయ అరాచకాలు అనేకమని.. వారికి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలు లేకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడేవారా?’ అని మోదీ ప్రశ్నించారు.
కాగా మోదీ తన ప్రసంగంలో తెలివిగా ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ తెలుగువారికి చేసిన అవమానాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉద్భవించిందన్నారు. అందుకే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ హయంలో రోజుకు 11 కిలోమీటర్లు మేర రోడ్డు వేస్తే.. తమ హయాంలో రోజుకు 22కి.మీల మేర రహదారులు వేసినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష నియోజకవర్గమా? మన నియోజకవర్గమా? అన్న బేధాన్ని తాము చూపించడం లేదని స్పష్టం చేశారు. ఖర్గే ఎంపీగా ఉన్న బీదర్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం 1020 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ వేసిందని... ఖర్గే రైల్వేమంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్ర్లాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. యూపీఏ కంటే తమ ప్రభుత్వం వచ్చాకే అత్యధిక గ్రామాల్లో పైబర్ నెట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా మోదీ ప్రసంగంలో రాజీవ్ గాంధీ కాలం నుంచి మొన్నటి విభజన వరకు ప్రతి అంశాన్నీ ప్రస్తావించడం.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా గుర్తు చేయడంతో.. చంద్రబాబు ప్రసంగాన్ని మోదీ చదివారా అన్న వ్యాఖ్యలు, సెటైర్లు వినిపిస్తున్నాయి. అచ్చంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి లైన్లో మాట్లాడుతుందో.. ఎలాంటి విమర్శలు చేస్తుందో మోదీ అదే తరహాలో మాట్లాడారు.. కాదంటే ఇతర రాష్ర్టాల అంశాలను ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు మాటలు మోదీ నోటి నుంచి వచ్చాయని... కేంద్రంపై చంద్రబాబు కోపం వంటివన్నీ డ్రామాలని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.