కాంగ్రెస్ భీష్ముడు.. మోడీకెలా సన్నిహితుడు?

Update: 2020-09-01 03:32 GMT
ఆయన పక్కా కాంగ్రెస్ వాది. దశాబ్ధాల అనుభవం కలిగిన మేధావి. కాంగ్రెస్ లో ప్రధాని తప్ప అన్ని పదవులు అనుభవించాడు. కానీ ఈ టాలెంటెడ్ ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం తొక్కేసింది. మూడు సార్లు ప్రధాని పదవిని ఇవ్వలేదు. కానీ ఆయన దేశంలోని అన్ని పార్టీలు, నేతలతో సన్నిహితంగా ఉంటాడు.. ప్రోత్సహిస్తాడు. అదే ఆయనను దేశంలో గొప్ప రాజనీతజ్ఞుడిగా చేసింది.

ప్రధాని నరేంద్రమోడీ కరుడుగట్టిన బీజేపీ వాది అయినా కాంగ్రెస్ వాది అయిన మాజీ ప్రధాని ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు. అందుకే కాంగ్రెస్ చేయలేని పనిని మోడీ చేశాడు.తన హయాంలో ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రధానం చేశాడు.

ప్రధాని మోడీ ఢిల్లీకి కొత్తగా వచ్చినప్పుడు తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ ప్రణబ్ నడిపించారని మోడీ గుర్తు చేస్తున్నారు.ప్రణబ్ పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతే అయినా రాష్ట్రపతి అయ్యాక ప్రధాని మోడీకి అన్ని విధాలుగా సహకరించడం ఆయన గొప్పతనం.

ప్రణబ్ రాష్ట్రపతిగా ఉండగా.. కొత్తగా ప్రధాని అయిన మోడీకి ఢిల్లీ స్థాయిలో పాలనాపరమైన అనుభవం లేకపోవడంతో ప్రణబ్ అండగా నిలిచారు. బీజేపీకి చెందిన ప్రధాని మోడీని ప్రణబ్ ఇబ్బంది పెడుతారేమోనని అందరూ ఊహించారు. కానీ అలాంటి ఏవీ పెట్టకుండా ప్రణబ్ గొప్ప మనసు చాటుకున్నారు. అందుకే మోడీ మెచ్చి మరీ కాంగ్రెస్ ఇవ్వని ‘భారతరత్న’ అవార్డ్ ఇవ్వడం విశేషం.
Tags:    

Similar News