అంగారక (మార్స్) గ్రహం మీద జీవాన్వేషణ కోసం శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపించిన రోవర్ 'పెర్సెవరెన్స్' అద్వితీయంగా ఆ గ్రహం మీద దిగి.. తన రీసెర్చ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో కీలకమైన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అది భూమికి చేరవేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాసా శాస్త్రవేత్తలు ప్రపంచానికి కూడా చూపిస్తున్నారు.
అయితే.. తాజాగా అంగారక గ్రహానికి చెందిన చంద్రుదు ఫొటోను షేర్ చేసింది నాసా. దాని పేరు 'ఫోబోస్'. అయితే.. అన్ని గ్రహాల మాదిరిగా అది గుండ్రంగా కాకుండా.. ఆలుగడ్డ (బంగాళాదుంప) మాదిరిగా ఉండడం గమనార్హం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోబోస్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా రాసింది. ''మీరు ఆలూ అంటారు. మేము అంగారకుని చంద్రుడు అని అంటాం. ఇది ఫోబోస్ కు చెందిన ఫొటో. ఇది అంగారకునికి గల రెండు చంద్రుళ్లలో ఒకటి. అతి పెద్దది. మార్స్ ఆర్బిటర్ అంతరిక్షయానంలో కెమెరా దీన్ని క్యాప్చర్ చేసింది. ఉపరితలం (మార్స్) నుంచి 6,800 కిలోమీటర్ల పై నుంచి తీసిన ఫొటో ఇది'' అని రాసుకొచ్చింది నాసా. ఇదిలా ఉండగా.. ఈ ఫోబోస్ గ్రహాన్ని 1877వ సంవత్సరంలో ఖగోళ శాస్త్రవేత్త ఆసఫ్ హాల్ కనుగొన్నారు.