నాసా అద్భుత సృష్టి ...37 రోజుల్లోనే వెంటిలేటర్‌ సిద్ధం !

Update: 2020-04-25 11:50 GMT
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బ కి స్తంభించిపోయింది. ఈ సమయంలో నింగిలోకి దూసుకెళ్లే అంతరిక్ష నౌకల తయారీలో చేయితిరిగిన నాసా ఇంజనీర్లు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. నాసా తమ సాంకేతిక నైపుణ్యాన్ని కలబోసి ..కరోనా రోగులకోసం నాసా ఇంజనీర్లు కేవలం 37 రోజుల్లో అత్యాధునిక వెంటిలేటర్ ను రూపొందించారు.

దానికి వైటల్ ‌(వెంటిలేటర్‌ ఇంటర్వెన్షన్‌ టెక్నాలజీ యాక్సెసిబుల్‌ లోకల్లీ) అని పేరు పెట్టారు. న్యూయార్క్‌ లోని మౌంట్‌ సినాయ్‌లో ఉన్న ఐకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్ ‌లో నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో ఈ వెంటిలేటర్‌ నెగ్గడంతో దాని వినియోగానికి మార్గం సుగమమైంది. సాధారణ వెంటిలేటర్ కన్నా ఇది అద్భుతంగా పని చేస్తుందని, ఇందులోని విడి పరికరాలన్నీ అత్యుత్తమ సాంకేతిక నిపుణుల చేత తయారు చేయబడ్డాయని నాసా తెలిపింది.

అన్ని పూర్తి అయినా కూడా ఆస్పత్రుల్లో ఈ వెంటిలేటర్ వినియోగానికి డ్రగ్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సంస్థ అనుమతించిన వెంటనే దీన్ని ఆయా ఆసుపత్రులకు అందజేయనున్నారు. ముఖ్యంగా అమెరికాలోని చాలా హాస్పిటల్స్ లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ దేశంలో ఇప్పటికే కరోనాకు గురై సుమారు 50 వేలమందికి పైగా మృతి చెందారు. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 21 న దీనిని నాసా ప్రదర్శించింది.
Tags:    

Similar News