అమెరికాలో బిస్కెట్లు తయారయ్యేలా ఎండలు..!

Update: 2019-07-21 05:43 GMT
అమెరికా.. అగ్రరాజ్యం ఎప్పుడూ కూల్ గానే ఉండేది. సమశీతోష్ణ ఉష్ణోగ్రతలుండేవి. కానీ ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ఎంతలా అంటే బిస్కెట్లు కూడా తయారయ్యేంతగా.. మామూలుగా బిస్కెట్లను ఎలా తయారు చేస్తారు. వేడివేడి మంటలపై కాల్చితే బిస్కెట్ అవుతుంది.. కానీ అమెరికాలోని ఇప్పుడు ఎండలకు బిస్కెట్లు కూడా తయారవుతున్నాయట..

అమెరికాలోని ఎండల తీవ్రతకు నిదర్శనమీ చిత్రం. తాజాగా అమెరికాలోని కొందరు ఎండల తీవ్రతను తెలియజేయడానికి వినూత్న ప్రయత్నం చేశారు. నాలుగు పచ్చి బిస్కెట్లను ఒక ట్రేలో తీసుకొని ఎండలో ఉన్న ఒక కారులో పెట్టారు. 45 నిమిషాల తర్వాత ఆ వేడికి బిస్కెట్ ఉడకడం ప్రారంభమైంది.

దాదాపు 8 గంటల  తర్వాత బిస్కెట్లు  పూర్తిగా కాలి రంగులోకి మారాయి. దీన్ని బట్టి అమెరికాలో ఎండల తీవ్రత ఎంత ఉందో అర్థమైంది. ప్రస్తుతం అమెరికాలో ఎండలు బాగా పెరిగాయి. 42 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయట.. కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీల వరకు ఉందట.. ఎప్పుడూ 35 డిగ్రీలు దాటని ఎండ ఈసారి మాత్రం దంచికొడుతుండడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
Tags:    

Similar News