తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఈనెల 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హెచ్ ఎంస్ జాతీయ అధ్యక్షుడైన నాయిని తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల గురించి వివరించే క్రమంలో ఐకాస చైర్మన్ పై విరుచుకుపడ్డారు. అసలు కోదండరాం ఎవరని హోం మంత్రి నాయిని ప్రశ్నించారు. ``ఒకనాడు తెరాస - ప్రజాసంఘాలు - ఎన్జీఓలు సపోర్ట్ చేస్తేనే టీజేఏసీ చైర్మన్ అయ్యాడు. కోదండరాంను టీజేఏసీ చైర్మన్ ను చేసిందే కేసీఆర్. కోదండరాంకు ఆర్థికంగా సహాయం చేసిందే కేసీఆర్. అలాంటి కోదండరాం మాకు ద్రోహం చేశాడు`` అంటూ హోంమంత్రి నాయిని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీకి తాము ఎంతో సపోర్ట్ చేశామని పేర్కొన్న మంత్రి నాయిని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఓట్లు వేసుకోండని చెప్పి కోదండరాం మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు టీజేఏసి లేనేలేదని, అందులో ఉన్న సంఘాలన్నీ బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. కోదంండరాం ఆరోపిస్తున్నట్లు.జ.సింగరేణి ప్రైవేటికరణ అయ్యే ప్రసక్తే లేదని తెలిపారు. సింగరేణిలో భారీ మెజారిటీతో గెలుస్తామని నాయిని ధీమా వ్యక్తం చేశారు. AITUC - INTUC - TNTUC లకు ఎట్టి పరిస్థితితుల్లో ఓట్లు వేయొద్దు... అవకాశవాద రాజకీయాలకు తావివ్వద్దని ఆయన కోరారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి - టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముగ్గురూ కలిసి తెరాసను ఓడగొట్టాలని ఏఐటీయూసీకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ లో హెచ్ ఎంఎస్ కలిస్తే తప్పేంటని హెచ్ ఎంస్ జాతీయ అధ్యక్షుడైన హోంమంత్రి నాయిని ప్రశ్నించారు. సింగరేణి ని కాపాడడానికి హెచ్ ఎంఎస్ రాష్ట్ర కమిటీ ఈనెల 27న సమావేశమై టీబీజీకేఎస్ ను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు. అయితే ఇప్పుడు హెచ్ ఎంఎస్ నిట్టనిలువునా చీలిపోయిందని తెలిపారు. హెచ్ ఎంఎస్ ప్రెసిడెంట్ టీబీజీకేఎస్ కు మద్దతు ఇస్తుంటే... సెక్రెటరీ రియాజ్ అహ్మద్ తాను హెచ్ ఎంఎస్ నుంచి పోటీ చేస్తున్నా అంటూ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చేసాడన్న కారణంతో... రియాజ్ అహ్మద్ ని సస్పెండ్ చేశామని హెచ్ ఎంస్ జాతీయ అధ్యక్షుడైన నాయిని వివరించారు. ఢిల్లీకి వెళ్లి మరీ రియాజ్ అహ్మద్ గురించి ఫిర్యాదు చేశామని... రాష్ట్ర కమిటీ నిర్ణయమే తమ నిర్ణయమని అన్నారు. సింగరేణి కార్మికులు తమ హక్కులను సంరక్షించుకోవాలంటే...టీబీజీకేఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు.