సుశాంత్ మరణాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు?

Update: 2020-08-12 16:37 GMT
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. ఇది ముంబైలో రాజకీయ అంశంగా మారింది. సీఎం కొడుకు హస్తం ఈ హత్యలో ఉందన్న అనుమానాలున్నాయి. ఇక బీజేపీ ఇది ముమ్మాటికీ హత్యనే అంటున్నారు. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని.. కానీ దాని గురించి ఎందుకింత చర్చిస్తున్నారని శరద్ యాదవ్ ప్రశ్నించారు. నా దృష్టిలో ఇది పెద్ద విషయం ఏమీ కాదని తెలిపారు.

దేశంలో రోజుకు 20 మందికి పైగా రైతులు చనిపోతున్నారని.. వాళ్ల గురించి పట్టించుకోవడం లేదని ఓ రైతు నాతో అన్నాడు అని శరద్ పవార్ తెలిపారు.

ఇక సుశాంత్ కేసు విచారణలో ముంబై పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఈ రాజకీయ కురువృద్ధుడు అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News