ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇపుడు కూడా చౌకబారు రాజకీయాలే చేస్తున్నారు. విజయనగరం మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుమంది రోగులు చనిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళ మృతికి జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రాహిత్యమే కారణమంటు చంద్రబాబు రెచ్చిపోయారు. డిమాండ్ కు తగ్గట్లుగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవటం ప్రభుత్వ వైఫల్యమట. జగన్ చేతకాని తనంవల్లే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత పెరిగిపోతోందంటు నోటికొచ్చిన ఆరోపణలు చేసేశారు.
ఎక్కడో ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా లేకపోతే జగన్ ఏమి చేస్తారు ? ఆ విషయం చూసుకోవాల్సిందే ఆసుపత్రి ఉన్నతాధికారులు. ఆక్సిజన్ కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. లేదా వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ఆక్సిజన్ సమస్య వల్ల రోగులు చనిపోలేదని, కేవలం సాంకేతిక సమస్యల వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారని అధికారులు చెబుతున్నా చంద్రబాబు అండ్ కో పట్టించుకోవటంలేదు.
ఇక జగన్ చేతకాని తనంవల్లే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏపిలో కాదు యావత్ దేశం మొత్తంమీద ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లన్నీ కేంద్రప్రభుత్వ ఆదీనంలోనే ఉన్నాయి. రాష్ట్రాలకు ఆక్సిజన్ను ఇపుడు కూడా కేంద్రమే కేటాయిస్తోందన్న చిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలీకుండానే ఆరోపణలు చేస్తున్నారా ? ఆక్సిజన్ సరఫరా విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, కేరళ ముఖ్యమంత్రులు కేంద్రప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే చంద్రబాబు మాత్రం జగన్ను తప్పుపట్టడమే ఆశ్చర్యంగా ఉంది.
నరేంద్రమోడి అంటే చంద్రబాబుకు భయమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఎలాగైనా బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని తపనపడుతున్నారు. తాను బీజేపీకి మళ్ళీ దగ్గరవ్వాలంటే జగన్ను విమర్శించటం, ఆరోపించటమే మార్గమని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. ఇందుకే మోడి వైఫల్యాలను కూడా జగన్ ఖాతాలో వేసేసి ప్రతిదానికి ప్రభుత్వంపై బురద చల్లేస్తున్న విషయం తెలిసిపోతోంది.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ను కూడా కేంద్రమే రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న విషయం ప్రతిఒక్కళ్ళకు తెలుసు. వైజాగ్ మనరాష్ట్రంలో ఉంది కాబట్టి మొత్తం ఆక్సిజన్ అంతా మనమే ఉపయోగించుకోవాలంటే సాధ్యంకాదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం పరిధిలో ఉందికాబట్టే కేటాయింపులు కూడా దానిష్టం. ఆక్సిజన్ సమస్య ఒక్క మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఉంది.
కాబట్టి ఆక్సిజన్ సమస్యపై చంద్రబాబు ఆరోపించాలంటే నేరుగా మోడినే టార్గెట్ చేయాలి. అంత ధైర్యంలేకే జగన్ పై బురద చల్లేస్తున్న విషయం తెలిసిపోతోంది. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దేనికయ్యా అంటే చౌకబారు విమర్శలు చేయటానికి తప్ప ఇంక దేనికి పనికిరాదని తేలిపోయింది.