వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఆ మీడియా వర్గం పని తీరు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే చాలా అసంతృప్తితో ఉన్నారు. జగన్ కు సాక్షి అందించాల్సిన స్థాయిలో సేవలను అందించడం లేదు అనేది అభిమానుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ఫిర్యాదు.
జగన్ అనుకూలతలను చూపించడంలో అయినా, చంద్రబాబు నాయుడి ప్రతికూలతలను హైలెట్ చేయడంలో అయినా సాక్షి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడం లేదు అనేది చాలా మంది జగన్ అభిమానుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో సాక్షిలో మార్పు రావాలని కూడా వారు కోరుకుంటూ ఉంటారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఇలాంటి తరుణంలో మార్పులు రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. మరి జగన్ కు సాక్షి ముందు ముందు ఎలాంటి సేవలను అందిస్తుందో కానీ.. ఆ మీడియా సంస్థలో కొన్ని పాలన పరమైన మార్పులు చోటు చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది.
సాక్షికి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబోతున్నాడని సమాచారం. ఒక తమిళ మీడియా సంస్థలో పని చేసిన వినయ్ మహేశ్వర్ సాక్షికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా రాబోతున్నాడట. ఇది కీలకమైన మార్పే అని తెలుస్తోంది. పై స్థాయిలో జరుగుతున్న ఈ మార్పు సంస్థలో చాలా మార్పులను తీసుకురావొచ్చని చెబుతున్నారు.
ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పత్రిక వ్యవహరించాల్సిన తీరు గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కె.రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన కాంట్రాక్ట్ కాలం మరి కొంత సమయం ఉందని.. ఆ మేరకు ఆయన కొనసాగుతారని తెలుస్తోంది. ఇక ఎడిటర్ గా వర్ధెల్లి మురళి కొనసాగనున్నారని తెలుస్తోంది.