తెలంగాణలో గవర్నర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ సర్కార్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసి విమర్శించడం.. దానికి కౌంటర్ గా మంత్రులు కేటీఆర్ సహాలు పలువురు కౌంటర్ ఇవ్వడంతో ఇది మరింత ముదిరింది. ఈ క్రమంలోనే గవర్నర్ తెలంగాణలో పర్యటిస్తే ప్రభుత్వం సహకరించడం లేదు. ఏ అధికారి పట్టించుకోవడం లేదు. తాజాగా భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు గవర్నర్. అక్కడ కూడా అధికారులు గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ ను సరిగ్గా పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తమిళిసై.. అక్కడ ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. తెలంగాణలో తాను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని కామెంట్ చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కొడుకు పెళ్లికి హాజరైన గవర్నర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎక్కడా రాజకీయం చేయడం లేదని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ప్రతి నెల కేంద్రానికి ఇచ్చే నివేదికలో చెప్పాల్సినవి చెబుతున్నాని అన్నారు. ప్రొటోకాల్ పాటించని కేంద్ర సర్వీసుల్లోని అధికారుల విషయంలో కేంద్రమే తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఈ క్రమంలోనే రెండోసారి ఢిల్లీ వెళ్లిన తమిళిసైని బదిలీ కోసమే పిలిపించారని తెలుస్తోంది. 12 రోజుల వ్యవధిలోనే రెండోసారి పిలిపించడంపై కేంద్రం ఆమెను ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకేనని మీడియాలో ప్రచారం సాగుతోంది.
టీఆర్ఎస్ ప్రబుత్వంతో విభేదాలు పెరిగిన నేపథ్యంలోనే కేంద్రం తమిళిసైని కేరళ లేదా మరో రాష్ట్రానికి పంపి ఇక్కడ కొత్త వ్యక్తిని కేంద్రం నియమించనున్నట్టు తెలుస్తోంది.
అయితే మీడియాలో వస్తున్న కథనాలు నిజమా? లేక అవన్నీ ఊహాగానాలా? అన్నది తెలియాల్సి ఉంది. నిజంగా గవర్నర్ మారుతారా? లేదా అన్నది వేచిచూడాలి.