ఫారిన్ లో మరణం.. దేశానికి తీసుకురావాలంటే ఇలా చేయాలట

Update: 2020-04-22 05:00 GMT
కరోనా వేళ.. యావత్ ప్రపంచం స్తంభించిన వేళ.. కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో మరణించిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటివి సాధ్యమేనా? అంటే కొన్ని ఉదంతాల్లో అలాంటివి చోటు చేసుకుంటాయి. మరి.. ఆ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఫాలో కావాల్సిన రూల్స్ ను సిద్ధం చేసింది కేంద్ర సర్కార్.

అదే సమయంలో విమాన ప్రయాణం లో మరణిస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కరోనా మరణం ఖాతాలో వేసేస్తారట. అంతేకాదు.. ఫ్లైట్ జర్నీలో మరణించిన వారి మృతదేహాన్ని తరలించే విషయంలోనూ కొన్ని రూల్స్ ను రూపొందించారు. వీటిని పక్కాగా పాటించాల్సిందేనని కేంద్ర సర్కారు స్పష్టం చేస్తోంది. ఈ రెండు సందర్భాల్లో బాధితుల పార్థీవదేహాల్ని తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ఏవంటే..

%  మృతికి కారణాన్ని తెలిపే మరణ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో ఎయిర్ పోర్టు హెల్త్ ఆఫీసర్  చెక్ చేయాలి.
%  తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న భారత అధికారుల అనుమతి పత్రం ఉండాలి.
%  అధికార యంత్రాంగం ధ్రువీకరించిన ఎంబామింగ్ పత్రం ఉండాలి.
%  మృతదేహాన్ని ఉంచిన శవపేటిక ఎలా ఉందన్నది సంబంధిత విమాన అధికారులు తనిఖీ చేయాలి.
%  భారత విమానచట్టం.. 1954 ప్రజారోగ్య నిబంధనల ప్రకారం శవపేటిక ఉంటేనే అనుమతిస్తారు.
%  ఒకవేళ శవపేటిక దెబ్బతింటే.. దాన్ని తీసుకెళ్లేవారు పీపీఈ కిట్లను తప్పనిసరిగా వాడాల్సిందే.
%  మృతదేహాన్ని, అందులోని రసాయనాలను అస్సలు తాకకూడదు.
%  అంతిమ సంస్కారాలు చేసేందుకు శవపేటికను అధికారులకు అప్పగించాలి.
%  ప్రమాదకర వ్యాధి కారకాలు ఉన్నందున పూడ్చటం కానీ కాల్చటం మాత్రమే చేయాలి.
%  శవపేటికను మోసినవారు 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.
%  డెడ్ బాడీని తీసుకెళ్లిన వాహనాన్ని శానిటైజ్ చేయాలి.
%  శవపేటికను తీసుకొచ్చిన విమానాన్ని వైద్యుల మార్గదర్శకాల ప్రకారం శానిటైజ్ చేయాలి.
%  డెడ్ బాడీని విమానంలో ఎక్కించిన సిబ్బంది కూడా 28 రోజులపాటు నిర్బంధంలో ఉండాలి.
%  దహన సంస్కారాలు నిర్వహిస్తే.. బూడిదను సేకరించే బంధువులకు ఏ ప్రమాదం ఉండదు.
%  చట్టానికి అనుగుణంగా బూడిదను తొలగించాలి.
%  విమాన ప్రయాణంలో మరణించిన వ్యక్తి ఎవరినైనా కరోనా బాధితుడిగానే పరిగణిస్తారు.
%  విమానంలో మరణిస్తే పైలెట్ కు సమాచారం ఇచ్చి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
%  భారత గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు మరణిస్తే.. డెడ్ బాడీని ప్లాస్టిక్ షీట్లతో కప్పేయాలి
%  డెడ్ బాడీకి పక్కనున్న ప్రయాణికుల్ని ఖాళీ చేసి వేరే సీట్లకు మార్చాలి
%  విమాన ప్రయాణం 8 గంటలు ఉంటే.. దగ్గర్లోని ఎయిర్ పోర్టులో డెడ్ బాడీని దించేయాల్సి ఉంటుంది.
%  విమానం ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో.. ఆ ఎయిర్ పోర్టుకు మరణ సమాచారాన్ని ముందే అందించాలి
Tags:    

Similar News