టీడీపీలోనూ ఇదే సంత‌.. బాబుకు అగ్నిప‌రీక్షే..!

Update: 2022-07-26 14:00 GMT
ఔను! వైసీపీలో ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో.. ఇలాంటి ప‌రిస్థితే... టీడీపీలోనూ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో పోటీ చేసిన అభ్య‌ర్థులు ఇప్పుడు యాక్టివ్ గా లేక‌పోవ‌డం.. ఉన్న నాయ‌కుల‌కు టికెట్లు ఇస్తారో లేదో అనే భ‌యం వెంటాడుతోంది. అచ్చు.. ఇదే ప‌రిస్థితి వైసీపీలోనూ ఉంది.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు కూడా టికెట్లు ద‌క్కుతాయో లేదో .. అనే ధోర‌ణిలో అల్లాడుతున్నారు. సీఎం జ‌గ‌న్ వీరికి స్ప‌ష్టంగానేచెప్పేశారు.

గ్రాఫ్ పెర‌గ‌క‌పోతే.. టికెట్లు క‌ష్ట‌మేన‌ని ఆయ‌న వెల్ల‌డించేశారు. కానీ, టీడీపీలో అస‌లు టికెట్ల ఊసు క‌నిపిం చ‌డం లేదు దీంతో ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్న వారు కూడా.. టికెట్ల విష‌యంపై బెంగ పెట్టుకున్నారు. ``పార్టీ కోసం.. చాలా క‌ష్ట‌ప‌డుతున్నాం. అయినా.. కూడా టికెట్ల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జన కొన‌సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా.. టికెట్లు ద‌క్కుతాయో లేదో ..అనే విష‌యంలో క్లారిటీలేదు`` అని నాయ‌కులు బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇక‌, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న వారు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు వ‌స్తే.. త‌ప్ప నాయ‌కులు క‌ద‌లడం లేదు. బాబు వ‌స్తే.. పండ‌గ‌.. లేక పోతే.. దండ‌గ అన్న‌ట్టుగా.. కొన‌న్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లాను తీసుకుంటే..నెల‌లో రెండు సార్లు .. ఇటీవ‌ల వ‌ర‌కు ఆయ‌న ప‌ర్య టించారు. దీంతో అక్క‌డ జోష్ క‌నిపించింది. కానీ.. ఆయ‌న అక్క‌డ నుంచి వెనుదిర‌గ‌గానే.. నాయ‌కులు మ‌ళ్లీ క‌నిపించ‌డం మానేశారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. వారి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవాల‌ని.. చంద్ర‌బాబు కోరుతున్నా.. ఆయ‌న పిలుపు నిచ్చిన ఒక‌టి రెండు రోజులు బాగానే ఉంటున్న నాయ‌కులు.. త‌ర్వాత మాత్రం క‌నిపించ‌డం లేదు. వైసీపీలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. సీఎం చెబితే త‌ప్ప నాయ‌కులు ముందుకు క‌ద‌ల‌డం లేదు. ఇదే ప‌రిస్థితి టీడీపీలోనూ క‌నిపిస్తోంది. అంటే..రెండు పార్టీల్లోనూ ఒకే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంద‌నేది వాస్త‌వం. అందుకే.. పార్టీలు రెండూ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News