బిట్ కాయిన్ల మీద మోజు తీరే మాట చెప్పిన కుబేరుడు

Update: 2022-05-03 02:56 GMT
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ సంపన్నుడిగా నిలిచిన టెస్లా అధినేత ఎలాన్ మాస్క్.. ఇంతటి సంపన్నుడయ్యాడంటే బిట్ కాయిన్లు కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. క్రిప్టో కరెన్సీ అన్నంతనే గుర్తుకు వచ్చే మరో మాట.. బిట్ కాయిన్. భౌతికంగా చూసుకోవటానికి కనిపించని ఈ బిట్ కాయిన్.. ఎంతటి విలువ పలుకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బిట్ కాయిన్ల మీద ఆసక్తి ఎంతలా పెరుగుతుందో.. వీటిని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా అంతే ఎక్కువ అవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ బిట్ కాయిన్ల విలువ ఆన్ లైన్ లో అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం ఐదు గంటల వేళలో బిట్ కాయిన విలువ 38,712.75 డాటర్లుగా చెబుతారు.దీని మార్కెట్ క్యాపిటైజేషన్ మన రూపాయిల్లో చెప్పాల్సి వస్తే.. 56.30 లక్షల కోట్లుగా చెప్పాలి.

ఇంత భారీగా ఉన్న ఈ నగదు ఏదీ భౌతికంగా కనిపించకపోవటం గమనార్హం. బిట్ కాయిన్ల మీద కొందరు సంపన్నులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అందుకు భిన్నంగా ప్రపంచంలో కుబేరుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ఆయన తన మనసులోని మాటల్ని చెప్పేందుకు అస్సలు వెనుకాడరు. ఆయనే.. వారెన్ బఫెట్. తాజాగా ఆయన బిట్ కాయిన్ మీద తనకున్న అయిష్టతను మరోసారి స్పష్టంగా చెప్పేశారు.

తాజాగా ఒక మీడియా చానల్ తో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న బిట్ కాయిన్లు మొత్తాన్ని తనకు ఇచ్చేస్తానంటే కూడా తాను వాటిని కనీసం 25 డాలర్లకు కూడా కొననని తేల్చేశారు. బిట్ కాయిన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఒకవేళ వాటిని కొనుగోలు చేసినా.. వాటిని ఎవరో ఒకరికి అమ్మాల్సి ఉంటుందన్న ఆయన.. మరో పోలిక చెప్పి.. తనకున్న ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అమెరికాలో ఉన్న అన్ని అపార్ట్ మెంట్లలో కేవలం ఒక శాతం అమ్మినా.. నేను 25 బిలియన్ డాలర్లు ఇస్తానని చెప్పారు.

అంతేకాదు.. ఇదే మొత్తాన్ని అమెరికాలోని సాగుభూమి మొత్తంలో ఒక శాతాన్ని ఇచ్చేసినా కూడా వాటిని కొనుగోలు చేయటానికి తాను ఇష్టపడతానని చెప్పిన ఆయన.. వ్యవసాయ భూమితో ఆహార ఉత్పత్తులు వస్తాయన్నారు.

కానీ.. బిట్ కాయిన్లతో అలాంటి అవకాశమే లేదన్నారు. ఏమైనా.. వారెన్ బఫెట్ తాజా మాటలు వింటే.. కొత్తగా ఉండటమే కాదు.. ఉత్పత్తి వస్తువులకు ఇచ్చేంత విలువ ఏమిటన్నది తన మాటలతో చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News