ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీ నాయకులు కోపంతో ఊగిపోతున్నారు. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు లోకేష్ ల మీద చేసిన అనుచిత కామెంట్స్ తో ఎన్నడూ లేని విధంగా క్రిష్ణా జిల్లా టీడీపీ ఒక్కటిగా నిలిచి తొడకొట్టింది. ఈసారి అసెంబ్లీ ముఖం ఎలా చూస్తావో నేనూ చూస్తాను అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలోనే తొడకొట్టారు.
అంతే కాదు నాని మీద ఆయన ఏకవచన ప్రయోగంతో విరుచుకుపడ్డారు. ఏ చంద్రబాబు బూట్లు పట్టుకుని టికెట్లు రెండు సార్లు సంపాదించావో గుర్తులేదా కొడాలీ అని ఫ్లాష్ బ్యాక్ కధ కూడా చెప్పారు. నీవు బాబు ముందు టికెట్ కోసం వంగి దండాలు పెట్టినదానికి నేనే సాక్షిని అంటూ గుర్తు చేశారు. నీవా ఈ రోజు చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద మట్లాడేది అంటూ మండిపోయారు.
అసలు నీవు ఎవరని టికెట్ ఇవ్వాలి. గుడివాడలో రావి శోభనాద్రి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి టికెట్ ఇస్తే నీవు రెండు సార్లు ఎమ్మెల్యే అయి అదే ఫ్యామిలీ మీద విషం చిమ్ముతావా అంటూ ఫైర్ అయ్యారు. నానీ ఇదే నీకు ఎమ్మెల్యేగా చివరి చాన్స్. ఇక నీవు జీవితంలో ఎమ్మెల్యేవు కాలేవు అంటూ చాలెంజి కూడా చేశారు. అంతే కాదు గుడివాడ నుంచి రావి వెంకటేశ్వరరావు తో కూడా తొడకొట్టించారు. ఆయనే నిన్ను ఓడించే మొనగాడు అని సభకు పరిచయం చేశారు.
ఈ సభలో చాలా మంది టీడీపీ నాయకులు నాని మీద మాటలతో మంటలే పెట్టారు. పేకాట మంత్రి, బూతుల మంత్రి కూడా ఆయనే అని నిందించారు. ఇదంతా హాజరైన క్యాడర్ ని సైతం ఉత్సాహపరచింది. నానికి గుడివాడలో స్వయంగా తానే పనిగట్టుకుని మరీ ఓడిస్తాను అని దేవినేని చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ గుడివాడలో నానికి ఉన్న గుట్టు మట్లు పట్లు తెలుసుకుంటేనే ఓడించగలరు అని అంటున్నారు.
నాని టీడీపీ వారికి ఎంత విరోధి అయినా గుడివాడ వారికి మాత్రం ఆరాధ్యుడిగానే ఉంటున్నారు. పైగా ఆయనకు కాపులు, బీసీలు, కమ్మల మద్దతు కూడా దండీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల వేళకు గుడివాడ టీడీపీ నుంచి కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ తోనే నాని గెలుస్తున్నారని అంటున్నారు. అంటే సొంత పార్టీ వారే సైకిల్ ని అక్కడ కిల్ చేసి నాని గెలుపునకు సహకరిస్తున్నారు అన్న మాట.
నిజానికి ఎన్టీయార్ తొలిసారి గెలిచిన గుడివాడలో టీడీపీ ఓడిపోవడం అంటే దారుణమే. ఆ పార్టీకి ఏ ఎన్నికలోనూ 35 శాతం కంటే ఓట్లు తగ్గలేదు. అయితే నానిలోనే కొందరు లోకల్ టీడీపీ వారు తమ నేతను చూసుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక నాని మీద తొడకొట్టిన దేవినేని ఉమాకు 2024 లో మైలవరంలోనే ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఈ రోజుకీ ఇంకా గ్రాఫ్ పెంచుకోలేకపోతున్నారు.
మరో వైపు క్రిష్ణా జిల్లాలో వర్గాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి క్రిష్ణా జిల్లా మీటింగ్ పెడితే ఏకంగా విజయవాడ ఎంపీ కేశినేని నానే హాజరు కాలేదు. ఇలా పార్టీలో లుకలుకలు సెట్ చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఒకనాడు క్రిష్ణా జిల్లాలో టీడీపీకి పూర్తి బలం ఉండేది. ఇపుడు ఎందుకో నిరాశలో పార్టీ ఉండబట్టే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇలా హట్ కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.