ఇంటికోపువ్వు.. ఈశ్వరుడికో మాల! అన్నచందంగానే రాజకీయాలు కూడా సాగుతాయి. నాయకులు.. నాయ కులు కలిస్తేనే పార్టీ.. నేతలు నేతలు కలిసి పనిచేస్తేనే.. అధినేతకు పదవులు. అందుకే..పార్టీలో కట్టుతప్ప ని నాయకత్వాన్ని.. నాయకులను పార్టీ అధినేతలు కోరుకుంటారు. వారికే ఆచి తూచి టికెట్లుకూడా ఇస్తారు. ఇదే విధానం.. 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ కూడా అవలంభించింది. పార్టీ అధినేత పవన్‌కు ఎంతో నమ్మకం ఉన్నవారికే టికెట్లు ఇచ్చారు.
పొత్తులో భాగంగా.. కొన్నింటిని బీఎస్పీకి.. మరికొన్ని టికెట్లను కమ్యూనిస్టులకు కేటాయించారు. అయినప్ప టికీ.. 126 స్థానాల్లోజనసేన అభ్యర్థులు పోటీ చేశారు.
వీటిలో కీలకమైన.. విజయవాడ పశ్చిమ, రాజమండ్రి, ఏలూరు, అనంతపురం, గుంటూరు, పెదకూరపాడు.. ఇలా..అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ టికెట్లు ఇచ్చిన వారంతా కూడా.. విద్యావంతులు.. రాజకీయాల్లో పరిణితి పొందిన వారితోపాటు.. మరికొందరు అప్ కమిట్ లీడర్స్ కూడా ఉన్నారు.
అయితే.. అందరూ ఓడిపోయారు. ఒక్క రాజోలు మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా.. జనసేన గెలుపు గుర్రం ఎక్కలేదు. అయితే..ఏ వ్యక్తికైనా.. పార్టీకైనా.. ఒక్క ఓటమి ప్రామాణికం కానేకాదు. గెలుపు ఓటములు సహజ ప్రక్రియ అయిన.. రాజకీయంలో..ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని.. గెలుపు కోసం.. పరిగెట్టడం.. నాయకుల లక్షణం. లక్ష్యం కావాలి. అయితే.. జనసేన తరఫున అప్పట్లో పోటీ చేసి ఓడిన వారిలో ఇప్పుడు.. పార్టీకి అండగా ఉన్నంది కేవలం పది మంది లోపే అంటే అతిశయోక్తి కాదు.
ఉభయగోదావరి జిల్లాల్లో ఓ నలుగురు నాయకులు యాక్టివ్‌గా ఉన్నారు. విజయవాడలో పోతిన మహేష్.. అనంతపురంలో ఓ ఇద్దరు నాయకులు మాత్రమే పార్టీ జెండా మోస్తున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అసలు వారు జనసేనలోనే ఉన్నారా? లేక.. జెండా మార్చారా? అనేది చర్చకు దారితీస్తోంది.
ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల ముందుగానైనా.. లైన్‌లోకి వచ్చి.. పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత వారిపై లేదా? అనేది ప్రశ్న. మరి .. దీనిపై పవన్ ఎలాంటి ప్రణాళిక వేసుకునిముందుకు సాగుతారో చూడాలి.