కళ్ళు మూసి తెరచేలోగా ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్ని పరీక్షే. ముఖ్యంగా అధికార పార్టీకి ఇంకా ఎక్కువగానే ఆ పరీక్ష ఉంటుంది. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ తప్పదు. అంతటి వైఎస్సార్ కూడా 2009లో పాస్ మార్కులే తెచ్చుకుని గట్టెక్కారు. మరి ఏపీలో అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. పైగా ఎన్నడూ లేనంతగా విపక్షం బలంగా ఉంది.
ప్రతిపక్షం విసురుతున్న సవాల్ కి పద్మవ్యూహానికి ఏ రకంగా ప్రతివ్యూహం రూపొందించాలి అన్నదే ఇపుడు వైసీపీ ముందు ఉన్న అతి పెద్ద సమస్య. ముందు దాని గురించి ఆలోచించుకోకుండా జనసైనికుల మీద మాకు సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా చెబుతున్నారు. దీని మీద సెటైర్లు గట్టిగా పడుతున్నాయి. రోజమ్మా ముందు మీ పార్టీ గురించి ఆలోచించుకోండి అని జనసేన నేతలు అంటున్నారు.
నిజానికి నగరిలో రెండు సార్లు గెలిచిన రోజాకు ఈసారి గెలుపు చాలా కష్టమని అంటున్నారు. పైగా అక్కడ జనసేన బలపడుతోంది. తెలుగుదేశం గట్టిగా ఉంది. ఇక వైసీపీలో వర్గ పోరు ఉంది. రోజా అభ్యర్ధిగా ఉంటే గెలిపించమని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్న నేపధ్యం ఉంది అంటున్నారు. ఈ క్రమంలో తన సొంత సీట్లో గెలుపు కోసం రోజా ప్రయత్నాలు చేసుకోవాల్సింది పోయి జనసైనికులకు సానుభూతి చూపిస్తామని
అనడం పట్ల జనసైనికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో వైపు చూస్తే యువ గళం అంటూ లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రకు పేరు పెట్టుకున్నారు. ఆయన యాత్ర యూత్ ని టార్గెట్ చేయాలని ఆ విధంగా టైటిల్ ని పెట్టుకుంటే దాని మీద కూడా రోజా కామెంట్స్ చేయడం పట్ల తమ్ముళ్ళు మండిపడుతున్నారు. నారా గళం అంటూ ఆమె అనడం పట్ల కూడా ఫైర్ అవుతున్నారు. తమ పార్టీ యువ నేత పాదయాత్రను చూసి వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని అంటున్నారు.
పవన్ విషయానికే వస్తే ఆయన ఏ టాక్ షోలోకి వెళ్ళకుండా బాలయ్య టాక్ షోకి వెళ్లాడు అని అది వింతగా ఉంది అనడం కూడా విమర్శల పాలు అవుతోంది. ఒక టాక్ షోకి పవన్ వెళ్ళడం కూడా తప్పేనా అని అంటున్నారు. ప్రతీ దాన్ని రాజకీయం చేయాలని చూడడంతో రోజా ముందుంటారని అంటున్నారు. ఏది ఏమైనా రోజా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నారు. ఆ పదవికి ఆమె న్యాయం చేయాల్సి ఉండగా ఎంతసేపూ విపక్షాల మీద విమర్శలు చేయడమేనా అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ మంత్రులు కానీ మరొకరు కానీ ఇపుడు అధికారాన్ని చూసి ఇలా విమర్శలతో దూకుడు చేస్తూ పోతే రేపటి రోజున ఆ పార్టీ ఓడిపోతే వారి మీద సానుభూతి చూపించేవారు ఎవరూ ఉండరని అంటున్నారు. మొత్తానికి రోజా విమర్శలకు ప్రతి విమర్శలు కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.