సంచలన నిర్ణయాలతో దూసుకెళుతున్న ప్రధాని మోడీని అంతం చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కొద్దికాలంగా ప్రచారంలో ఉన్న అంశాలు నిజమని తేలటమే కాదు.. అదెంత పెద్ద స్థాయిలో జరుగుతుందన్నవిషయం తాజాగా బయటకు వచ్చిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. పేలుళ్ల ద్వారా ప్రధాని మోడీని.. మరో 22 మంది ముఖ్యుల్ని హతమార్చేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్త భగ్నం చేసింది. ఈ కుట్రలో భాగస్వామ్యులైన కొందరిని అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది.
ప్రధాని మోడీతో పాటు 22 మంది నేతల్ని..వివిధ దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని బాంబు పేలుళ్లు చేపట్టాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అల్ ఖైదా సానుభూతి పరులుగా అనుమానిస్తున్న అనుమానితుల్ని భద్రతా సిబ్బంది తాజాగా అదుపులోకి తీసుకున్నారు.మోడీతో పాటు పలువురు ప్రముఖుల్ని హతమార్చేందుకు పన్నిన కుట్రకు సంబంధించి తమిళనాడులోని పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తుసంస్థ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని భావిస్తున్న ముగ్గురిని మధురై జిల్లాలో అరెస్ట్ చేయటం గమనార్హం. మదురైకి చెందిన అబ్బాస్ అలీ (27).. అయూబ్ ఖాన్ (26).. అబ్దుల్ కరీంలను అధికారులు అరెస్ట్ చేశారు.వీరిని విచారించిన అధికారులకు ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందంటూ చెన్నైకి చెందిన ఒక సిస్టమ్ అనలిస్ట్ గా పని చేస్తున్న దావూద్ సలేమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విచారిస్తున్న అధికారులకు షాకింగ్ విషయాల్ని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో పాటు.. దక్షిణాదికి చెందిన పలువురు నేతల్ని.. పలు దేశాల కాన్సులేట్లను పేల్చివేయాలన్న కుట్ర పన్నినట్లుగా వారు వెల్లడించినట్లుగా సమాచారం. ఈ నలుగురు తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయటంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు ఏపీ.. తెలంగాణ పోలీసులు సహకరించినట్లుగా చెబుతున్నారు. ఇక.. ఈ నలుగురికి నాయకుడిగా భావిస్తున్న హకీం పరారు కావటం ఆందోళనకు గురి చేస్తోంది. అతడ్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/