సీనియర్ నటిపై గెలుస్తా అంటున్న యంగ్ హీరో!

Update: 2019-03-14 09:24 GMT
నటి సుమలత మండ్య నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఆ విషయాన్ని ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. తన భర్త రాజకీయ  ఆశయాలను తను సాధించడానికి పోటీకి రెడీ అని ఆమె ప్రకటించారు. ఆమె విషయంలో జేడీఎస్ మండి పడుతూ ఉంది.

సుమలత పోటీ చేస్తే జేడీఎస్ ఓట్లకు గండి పడుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో.. ఆమె పోటీ చేయడానికి వీల్లేదన్నట్టుగా ఆ పార్టీ వాదిస్తోంది. జేడీఎస్ నేత రేవణ్ణ అయితే..  సుమలత విషయంలో అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మాటలు వివాదం అయ్యాయి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పానుకోండి.

ఆ సంగతలా ఉంటే..సుమలత మండ్య నుంచి పోటీ చేసినా తను విజయం సాధించడం ఖాయమని ప్రకటించుకున్నారు నిఖిల్ గౌడ. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు అయిన ఇతడు - మండ్య నుంచి జేడీఎస్ తరఫున పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన విజయావకాశాల మీద ఆయన మాట్లాడాడు. సుమలత పోటీ చేసినా.. తను విజయం సాధించడం ఖాయమని నిఖిల్ గౌడ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.

అంబరీష్ కు మండ్య ప్రాంతంలో మంచి పట్టు ఉండేది. సుమలత పై ఇప్పుడు సానుభూతి కూడా ఉంది. అయినా నిఖిల్ మాత్రం గట్టి ధీమానే వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక ఏం  జరుగుతుందో.. ఓటర్ల చేతిలోనే ఉంది!
Tags:    

Similar News