ఆమెకు ట్రంప్‌ కు ఎఫైర్‌..మ‌నోళ్ల‌లో క‌ల‌వ‌రం

Update: 2018-01-27 07:55 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు సంబంధించిన అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ వెలువ‌డిన `ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌ సైడ్ ది ట్రంప్`  పుస్తకం సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులోకి తెలుస్తోంది. మైఖైల్ ఊల్ఫ్ రాసిన ఈ పుస్త‌కం తాజాగా అమెరికా రాజ‌కీయాల‌కు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహిస్తున్న భార‌తీయ అమెరిక‌న్ నిక్కీ హేలీ గురించి.

యూఎన్‌ లో అమెరికా రాయ‌బారి నిక్కీ హెలీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అఫైర్ ఉందని రచయిత మైఖేల్ వోల్ఫ్ రాసిన ఫైర్ అండ్ ఫ్యూరీ- ఇన్‌ సైడ్ ద ట్రంప్ వైట్‌ హౌజ్ పుస్తకం ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది. వాస్తవానికి వోల్ఫ్ రాసిన పుస్తకంలో నేరుగా ఎక్కడా ట్రంప్ - నిక్కీ మధ్య అఫైర్ ఉన్నట్లు రాయలేదు. కానీ ఓ దశలో వాళ్లు ఇద్దరూ ఎయిర్‌ ఫోర్స్ వన్‌ లో చక్కర్లు కొడుతున్నట్లు రాశాడు. నిక్కీతో చాలా వరకు తన ప్రైవేట్ టైమ్‌ ను ట్రంప్ గడుపుతున్నారని ఆ బుక్‌ లో ఆ రచయిత పేర్కొన్నాడు. ట్రంప్ - నిక్కీ హెలీ మధ్య కచ్చితంగా అఫైర్ ఉందని ఇప్పటికే మైఖేల్ వోల్ఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఆ వ్యాఖ్యలను నిక్కీ కొట్టిపారేశారు. ఆ వదంతుల్లో వాస్తవం లేదని - అవి చికాకు తెప్పిస్తున్నాయన్నారు. తన లాంటి సక్సెస్‌ ఫుల్ మహిళల పట్ల ఇలాంటి వాళ్లు దాడులు చేస్తుంటారని ఆమె విమర్శించారు. తాను ఒక్కసారి మాత్రమే ఎయిర్‌ ఫోర్స్ వన్‌ లో ప్రయాణించానని - ఆ సమయంలో చాలా మంది తమతో పాటు ఉన్నారని నిక్కీ తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి ట్రంప్‌తో ఎన్నడూ మాట్లాడలేదని - అసలు తానెప్పుడూ ట్రంప్‌ ను ఒంటరిగా కలువలేదని నిక్కీ స్పష్టం చేశారు.ఇదిలాఉండ‌గా...నిక్కీ హెలీ 2020లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని ఆసక్తిగా ఉన్నారని ఊల్ఫ్ గ‌తంలో వెల్ల‌డించారు. ఆమెను తన రాజకీయ వారసురాలని ట్రంప్ కూడా పరిగణిస్తున్నట్లు ఊల్ఫ్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న పుస్త‌కంలో రాశారు. ఇదిలాఉంగా...భార‌త సంత‌తికి చెందిన ప్ర‌ముఖ మ‌హిళ‌పై ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం అమెరికాలోని భార‌తీయుల‌ను క‌ల‌వ‌రంలో ప‌డేసింది.

సౌత్ కరోలినా గవర్నర్‌ గా పని చేసిన తొలి మహిళ నిక్కీ హేలీ భారత సంతతి మ‌హిళ‌. 2016 ఎన్నికల్లో ఫ్లోరిడా సెనెటర్ మార్కో రూబియో అభ్యర్థిత్వానికి తొలుత మద్దతు పలికారు. కానీ రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఆయనకు గట్టి మద్దతు దారుగా మారిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకతో స్నేహ పూర్వకంగా ఉండే నిక్కీ హేలీ.. ఆ కుటుంబంతో అనుబంధం పెంచుకున్నారు. దీని గురించే ఊల్ఫ్ వివ‌రించారు.ట్రంప్ కంటే నిక్కీ హేలీ మెరుగైన అభ్యర్థిగా ఉంటారని దేశాధ్యక్షుడి సన్నిహితుల మధ్య చర్చ జరిగిందని ఊల్ఫ్ త‌న పుస్త‌కంలో ఆనాటి సంగ‌తుల‌ను వెల్ల‌డించారు.  నిక్కీ హేలీని తొలుత విదేశాంగశాఖ మంత్రిగా నియమించాలని ట్రంప్ భావించినా.. చివరకు ఐరాసలో అమెరికా రాయబారిగా నియమించారని ఊల్ఫ్ వివరించారు. డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు స్టీవ్ బాన్నోన్ వ్యతిరేకత వల్లే నిక్కీ హేలీని విదేశాంగశాఖ మంత్రిగా నియమించలేదని తెలిపారు.
Tags:    

Similar News