అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనదేశానికి మరో షాక్ ఇచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చేవారికి షాకులు ఇస్తున్న ట్రంప్ తాజాగా అక్కడ మరో భారతీయ మూలాలున్న మహిళకు షాకిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిక్కీ హేలీ ఇవాళ తన పదవికి రాజీనామా చేయించినట్లు సమాచారం. తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారత్ లోని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా సైనిక ఉద్యోగి మైకేల్ హేలీతో ఆమె వివాహం జరిగింది. 2010లో దక్షిణ కరోలినా గవర్నర్ గా ఎన్నికయ్యారు. 2014లోనూ గవర్నర్ ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొందారు. అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడే వైఖరి నిక్కీహేలీది. ఆ చాతుర్యమే ఆమెను యూఎన్ లో అమెరికా రాయబారిగా నియమితులయ్యే అవకాశాన్ని అందించింది. 2017 జనవరిలో యూఎన్ లో యూఎస్ అంబాసిడర్ గా ఆమె నియమితులయ్యారు. అప్పటినుంచి అమెరికా తరఫున ఆమె బలమైన గళం వినిపిస్తున్నారు. అమెరికా-ఉత్తరకొరియాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు ఆమె యూఎన్ వేదికగా బలంగా వాదన వినిపించారు.
ఇలా కీలక స్థాయిలో ఉన్న హేలీని అధికారిక పదవుల నుంచి తొలగించినట్లు అమెరికా మీడియా వెల్లడిస్తోంది. అయితే, ఈ విషయంపై వైట్ హౌస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓవల్ ఆఫీస్ లో ఉదయం 10:30 గంటలకు నా ఫ్రెండ్ నిక్కీహేలీతో కలిసి పెద్ద ప్రకటన చేయబోతున్నానని ట్రంప్ తన అధికారిక ట్విటర్ లో పేర్కొన్నారు.