వాన్ పిక్ కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్న వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున న్యాయవాది సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ గైర్హాజరుపై మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసుల అదుపులో ఉండటంతో ఆయన రాలేకపోతున్నారని సీబీఐ కోర్టుకు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం సెర్బియాకు వెళ్ళిన ఆయనను సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ పోర్టు వ్యవహారానికి సంబంధించిన కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ పై యూఏఈలోని రస్ అల్ ఖైమా (రాక్)లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా యూఏఈ పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ పై ఇంటర్ పోల్ కు సమాచారం ఇవ్వడంతో వారు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అందులో భాగంగా సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
‘‘తాను సెర్బియాలో బెల్ గ్రేడ్ పోలీసులు నిర్బంధించిన కారణంగా కోర్టు వాయిదాకు హజరుకాలేకపోతున్నట్లు‘‘ నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐ కోర్టుకు తన న్యాయవాది ద్వారా సమాచారం అందజేశారు. సెర్బియాలో ఏం జరిగింది. అక్కడి కేసు వివరాలేమిటో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని సిబిఐ అధికారులను కోర్టు ఆదేశించింది.