ప్రాణవాయువు లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలో మునుపెన్నడు చూడని దారుణ పరిస్థితులు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో నెలకొన్నాయి. అవసరమైనంత ఆక్సిజన్ లేక పెద్ద ఎత్తున ప్రాణాలు పోతున్నాయి. పాలకుల నుంచి ఆక్సిజన్ కొరత లేదన్న గంభీరమైన ప్రకటనలు వస్తున్నా.. పోయే ప్రాణాలు మాత్రం పోతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుచూపుతో వ్యవహరించి యుద్ధ విమానాలు తెప్పించి మరీ.. ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపిన సంగతి తెలిసిందే.
మొత్తం తొమ్మిది ట్యాంకర్లలో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తీసుకొని ఒడిశా నుంచి బయలుదేరి సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. ఒడిశాలోని అంగుల్.. రూర్కెలా నుంచి ట్యాంకర్లను తీసుకొచ్చారు. దీంతో.. తెలంగాణలోని ఆక్సిజన్ కొరత దాదాపుగా తీరిపోవటమే కాదు.. వారం.. పది రోజుల పాటు ఆక్సిజన్ అవసరాలకు ఏ మాత్రం ఇబ్బంది లేదని చెబుతున్నారు.
ఇంతకీ.. ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకొచ్చింది ఎవరన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర సమాదానం వస్తుంది. ఆర్టీసీ డ్రైవర్ల చేత వీటిని తెప్పించారు. హైదరాబాద్ కు చేరుకున్న తొమ్మిది ట్యాంకర్లలో ఒక ట్యాంకర్ ను కరీంనగర్ కు.. మరో దాన్ని ఖమ్మం పంపారు. హైదరాబాద్ లోని కింగ్ కోఠి.. ఛాతీ.. టిమ్స్ ఆసుపత్రులకు పంపి.. అక్కడ ఆక్సిజన్ ఫిల్ చేశారు. అదే సమయంలో.. హైదరాబాద్ లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి.. ఆక్సిజన్ ను ఫిల్ చేశారు. మొత్తంగా చూస్తే.. తాజాగా వచ్చిన తొమ్మిది ట్యాంకర్ల ఆక్సిజన్ తెలంగాణ ఊపిరి తీసుకునేలా చేసిందని చెప్పాలి.