బ్యాంకులను అధికారికంగా కొల్లగొట్టిన.. ఆర్థిక నేరస్తుడు, `బడా దొంగ` అంటూ.. దేశప్రజలు దుమ్మెత్తి పోస్తున్న నీరవ్ మోడీ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. అది కూడా గుజరాత్ ఎన్నికలకు ముందు రావడం.. ఇది రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉండడం.. పైగా ప్రధాని మోడీకి కలిసి వచ్చే పరిణామాలు క నిపిస్తుండడం.. వంటి అంశాలు చాలా చాలా ఆసక్తిగా మారాయి.
విషయం ఏంటంటే.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి.. నీరవ్ మోడీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 11 వేల కోట్ల రూపాయల మేర మోసగించి, బ్రిటన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈయనను అప్పగించాలని.. విచారించాలని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కానీ, తాజాగా ఏం జరిగిందో ఏమో.. ఖచ్చితంగా గుజరాత్ ఎన్నికలకు ముందు.. బ్రిటన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నీరవ్‌ను అప్పగించేందుకు రెడీ అయింది.
భారత్‌కు అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్ న్యాయస్థానం తాజాగా కొట్టేసింది. దీంతో నీరవ్ మోడీని భారత్ తీసుకొచ్చేందుకు లైన్‌క్లియర్ అయ్యింది. దీంతో ఎట్టకేలకు భారత దర్యాప్తు ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వేల కోట్ల రూపాయల మోసం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ గత ఫిబ్రవరిలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి సామ్ గూజెస్ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు. ఈ తీర్పుని సవాలు చేస్తూ లండన్ కోర్టులో నీరవ్ మోడీ పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరిలో ఈ కేసుని పరిశీలించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జయ్ తాజా తీర్పునిచ్చారు.
గుజరాత్ ఎన్నికల్లో..
ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగింది. ఇలాంటి కీలక సమయంలో అతి పెద్ద ఆర్థిక నేరస్తుడిని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఏర్పడడం.. నిజంగానే అదికారంలో ఉన్న ప్రధాని మోడీకి రాజకీయ అస్త్రంగా మారుతుందని.. తాము తీసుకున్న చర్యల వల్లే.. మోడీ వచ్చాడని.. చెప్పుకుని.. ప్రజల్లో సింపతీ గెయిన్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మేధావులు అంచనా వేస్తున్నారు. మరి దీనిని ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.