తాజాగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నారైలపై పన్ను విధిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ వంటి విదేశాల్లోని సంపాదన పై ఈ పన్ను ఉంటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. భారత్ లోని ఎన్నారైల సంపదన పై మాత్రమే ఆదాయపు పన్ను విధించనున్నట్లు తెలిపారు. ఎన్నారైలు కేవలం భారత్ లో పెట్టిన పెట్టుబడి పై సంపాదించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని , ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టవలసిన అవసరం లేదు అని సీతారామన్ తెలిపారు.
కొత్తగా బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు, ఎన్నారైలు అయోమయానికి గురికావొద్దని , ఎన్నారైలు ఎప్పటి లాగే ఇతర దేశాల్లో హాయిగా ఆదాయం పొందవచ్చునని ,ఎన్నారైలకు ఇక్కడ ఉన్న ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రమే తమకు హక్కు ఉందని , విదేశాల్లో సంపాదించే ఆస్తులపై వచ్చే ఏ ఆదాయం పైనా పన్ను విధించే అధికారం తమకు లేదు అని తెలిపారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టం లో చేరుస్తామన్నారు. దీనిపై ఎన్నారైలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎగవేసే వారిపైనే తమ దృష్టి అన్నారు. విదేశీ రాబడి జోలికి తాము వెళ్లమని మరోసారి కేంద్రం స్పష్టం చేస్తూ ఆదివారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఎన్నారై హోదాను అడ్డు పెట్టుకొని భారత దేశంలోని ఆస్తులపై ఆదాయం సంపాదిస్తూ పన్ను కట్టకుండా ఉండే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకే ఎన్నారై నిర్వచనం లో మార్పులు చేసినట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఏడాదిలో 183 రోజులు విదేశాల్లో ఉన్న భారతీయులను ఎన్నారైలుగా పరిగణించేవారు. కానీ , ఇకపై 245 రోజులు విదేశాల లో ఉంటేనే ఎన్నారై గా గుర్తించనున్నారు. పొడిగించారు.