ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అవడం ఏమో కానీ..తెలుగు ప్రజలంటే అందరికీ దాదాపు చులకన అయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ విధానం స్పష్టంగా కనిపిస్తోంది. విభజనతో నష్టపోతున్న ఏపీని అన్నివిధాల ఆదుకుంటామని చెప్పిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు. చట్టంలో లేనందున తామేం చేయలేమంటూ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర చేతులెత్తేస్తోంది. మరోవైపు ప్రత్యేకహోదా, ఏపీకి దక్కాల్సిన లాభాలు, ఆర్థిక సౌలభ్యం అనే అంశాల విషంయలో ఇస్తాను అని చెప్పడం తప్ప ఇచ్చింది లేదు. కానీ హామీ మాత్రం కొనసాగిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి తగ్గట్లుగానే మాట్లాడారు ఆ పార్టీకి చెందిన నిర్మలా సీతారామన్. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటిస్తున్న సందర్భంగా పోలవరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేటాయించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
ఖర్చు చేసే మొత్తం అంటేనే ప్రాజెక్టును ఏం చేయదలుచుకున్నారో అర్థం అవుతోంది. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. అలాంటపుడు నిర్మాణ పనులు ఆలస్యం అవుతాయి. పోనీ కేంద్రం ఆదుకుంటుందా అంటే... ఈ ఏడాది బడ్జెట్ వలే ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తే పోలవరం నిర్మాణంపై ఆశలు వదులుకోవాల్సిందే. జాతీయహోదా ప్రకటించిన ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్న కేంద్రమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పడమే కాకుండా..ఇందుకు కేంద్రం సహాయం చేస్తుందని ప్రకటిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, పైగా తెలుగు రాష్ట్రానికి కోడలు అయిన మహిళ ఈ విధంగా మాట్లాడటం అంటే.. కేంద్రంలో ఏపీపై ఉన్న అభిప్రాయాన్నే ఆమె వ్యక్తం చేశారేమో అని పలువురు భావిస్తున్నారు. అదే నిజమైతే....ఏపీపై కేంద్ర మొసలి కన్నీరు అన్నట్లు భావించాల్సి వస్తుందేమో.