తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మారాడు.. కానీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం తెలంగాణలో మారేలా కనిపించడం లేదు. సీనియర్లు, జూనియర్లు కలిసిపోయిన దాఖలాలు లేవు. సమష్టిగా ఉంటామని కొత్త ఇన్ చార్జి థాక్రేకు నేతల హామీలు కేవలం ఉత్తుత్తి ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. లోలోపల నాయకుల మధ్య విభేదాలు మీటింగ్ నుంచి బయటకు రాగానే బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రపై అనుమానాలు నెలకొంటున్నాయి.
పార్టీ కోసం సమష్టిగా పనిచేస్తామని థాక్రేకు కాంగ్రెస్ నేతలు వాగ్ధానం చేశారట.. ప్రస్తుతమున్న టీపీసీసీ కమిటీలను సీనియర్లు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కస్టపడే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
పార్టీ బలోపేతం కోసం తాము కృషి చేస్తుంటే కీలక పోస్టుల్లో ఉన్న వ్యక్తులు మాత్రం నిత్యం విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు.
పార్టీ పంచాయితీలకు చెక్ పెట్టాలని రెండు రోజుల క్రితం కొందరు కార్యకర్తలు మాణిక్ రావుకు విజ్ఞప్తి చేశారు. అయనా చెప్పినా కూడా కాంగ్రెస్ సీనియర్లు మారకపోవడం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నెలకొందని అంటున్నారు.
ఛాన్స్ దొరికినప్పుడల్లా తనను టార్గెట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గతంలో కంటే కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తగ్గిందని.. కానీ హైకమాండ్ పసిగట్టకుండా రేవంత్ తన అనుచరులతో సభలు, సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్నారని సీనియర్లు థాక్రేకు వివరించినట్టు తెలిసింది.
ఒక్కొక్కరిని పిలిచి మరీ పరిస్థితులను అడిగిన థాక్రే ఎక్కువమంది రేవంత్ రెడ్డిపైనే ఫిర్యాదులు చేశారట.. ఈ నేపథ్యంలోనే ఆయన పాదయాత్రను అడ్డుకుంటున్నారట.. మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.