మోడీ సర్కారు కేంద్రంలో కొలువు తీరిన నాటి నుంచి పలు రంగాలపై అనుసరిస్తున్న విధానాలు చాలావరకూ మార్పులు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ కానీ ప్రధాని అయితే.. రైల్వే రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని.. ప్రజాకర్షక విధానాలకు కొంత మేర స్వస్తి పలికినా.. కొత్త రైల్వేలు పెద్ద ఎత్తున తీసుకొస్తారని.. కొత్త రైలులైను పనులు మొదలవుతాయన్న వాదనలు జోరుగా వినిపించాయి.
అయితే.. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త రైళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఎప్పటికప్పుడు ఏదో నిర్ణయం పేరుతో ప్రయాణికుల మీద భారం మోపటం మినహా మోడీ సర్కారు చేసిందేమీ లేదని చెప్పాలి. చివరకు రైల్వే బడ్జెట్ లో కొత్త రైళ్ల ప్రకటన కూడా లేకపోవటం మొదలైంది. బడ్జెట్ మాత్రమే రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయాలు ప్రకటించటం.. ఎప్పుడైనా అత్యవసరమైతే తప్పించి.. రైళ్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకునేవి కావు.
కానీ.. రైల్వేల విధానాల్లో సంస్కరణల పేరిట రాయితీలు రద్దు చేయటం.. పలువర్గాలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు కత్తెర వేయటంతో పాటు.. ఆ పేరు.. ఈ పేరు చెప్పి ఎంతోకొంత మొత్తాన్ని తరచూ ప్రయాణికుల మీద భారం మోపేలా నిర్ణయాలు తీసుకోవటం పెరిగింది. ఛార్జీలు పెంపు నిర్ణయం లేకుండా పెద్ద ఎత్తున రైల్వేలకు ఆదాయం పెరిగేలా చేశారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఇంతకాలం మాదిరి కాకుండా ఈసారి రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లో భాగం కావటం కొత్త పరిణామంగా చెప్పాలి.
మరి.. ఈ ప్రయోగంలో భాగంగా రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకుంటుందా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ బడ్జెట్ లో రైల్వే ఛార్జీల పెంపు ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. మౌలిక సదుపాయాలు.. సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ఛార్జీలు పెంచాలని భావించనా.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఛార్జీల పెంపు ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బడ్జెట్ లో వాతలు పెద్దగా ఉండవనే మాట వినిపిస్తోంది. ఏడాదికి ఒకసారి బాదేసే సూత్రానికి భిన్నంగా.. ఎప్పుడనుకుంటే అప్పుడు బాదేస్తున్న నేపథ్యంలో.. బడ్జెట్ లో బాదుడు లేకపోవటం తాత్కాలిక ఊరటే మాత్రమేనని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/