వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడున్న టీడీపీ లోక్ సభ సభ్యుల్లో అయిదు మందికి పైగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కావాలని కోరుతున్నారట. అదే సమయంలో పార్లమెంటుకు వెళ్లాలన్న కోరిక ఏ ఒక్క ఎమ్మెల్యే నుంచి కూడా వ్యక్తం కావడం లేదట. అలాగే.. కొత్తగా టికెట్లు ఆశిస్తున్నవారు కూడా అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారే కానీ లోక్ సభ సీట్లపై ఏమాత్రం మోజు చూపడం లేదట.
రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మురళీమోహన్ - విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని - విజయనగరం లోక్ సభ సభ్యుడు అశోక్ గజపతిరాజు - అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి - శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు లోక్ సభ కంటే అసెంబ్లీకి పోటీ చేయానలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే చంద్రబాబు వద్ద తమ మనోగతాన్ని వివరించారు. అయితే.. చంద్రబాబు మాత్రం వారిని లోక్ సభకే పోటీ చేయాలని సూచించారట.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారిలోనూ కొందరు ఈసారి చంద్రబాబు ముందు అసెంబ్లీ సీట్లే అడుగుతున్నారు. దీంతో లోక్ సభకు అభ్యర్థులు దొరకడం టీడీపీకి కష్టమవుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకొచ్చాక చంద్రబాబుకు - మోదీకి పూర్తిగా బెడిసికొట్టడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లోనూ మోదీయే మళ్లీ గెలిచే పరిస్థితులున్నాయని అర్థం చేసుకుంటున్న ఎంపీలు అలాంటప్పుడు ఎంపీలుగా గెలిచి లాభం లేదని భావిస్తున్నారట. అధికారంలో ఉన్న కూటమి నుంచి ఎంపీలుగా లేకపోవడం ఒకెత్తయితే.. చంద్రబాబుపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉండడం కూడా వారి భయానికి కారణమని తెలుస్తోంది. వివిధ వ్యాపారాలు చేసుకునే ఎంపీలకు కేంద్రంలో ఇప్పుడు ఏమాత్రం మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎంపీగా ఉండి లాభం లేదని చాలామంది భావిస్తున్నారట. దానికి బదులు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండడం నయమని.. అదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం కనుక మళ్లీ గెలిస్తే మంత్రి పదవి అడగొచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది.