బాబు కులాల బ్యాలెన్స్‌ ...అణ‌గారిన వ‌ర్గాల‌కు నో చాన్స్‌!

Update: 2017-04-01 19:29 GMT
వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఒకింత విమ‌ర్శ‌ల‌కు అవకాశంగా  మారింది. అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేసేది టీడీపీ మాత్ర‌మేన‌ని అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా చెప్పే చంద్ర‌బాబు ఈ విస్త‌ర‌ణ‌లో అణ‌గారిన వ‌ర్గాల‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని అంటున్నారు. కీల‌క సంద‌ర్భాల్లో కులాల లెక్కలు చూసుకునే బాబు ఈ ద‌ఫా మంత్రివ‌ర్గంలో కూడా ఎస్టీల‌కు అవకాశం క‌ల్పించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా మైనార్టీల‌కు సైతం మొండి చేయి చూపించారు. స‌మాజంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాలుగా ఉన్న‌వారికి అవ‌కాశం క‌ల్పించ‌క‌పోవ‌డం ఏమిటని పలువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. గిరిజ‌నుల విష‌యంలో ఒక‌వేళ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు లేర‌నుకుంటే పార్టీ పిరాయించ‌డం ద్వారా బాబు చేర్చ‌కున్న‌  వారు ఉండ‌టాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ముస్లింల విష‌యంలో ఆ బాధే లేదు. పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీలు ఉన్నారు. జంప్ జిలానీల కోటాలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ బాబు ఈ రెండు కీల‌క వ‌ర్గాల‌కు చాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం స‌ద‌రు వ‌ర్గాల్లో ఆగ్రహానికి కార‌ణంగా మారింది.

ఏపీ మంత్రివ‌ర్గంలో కులాల వారీ స‌మీక‌ర‌ణ‌లు చూస్తే....

**కమ్మ

నారా చంద్రబాబు నాయుడు
నారా  లోకేష్
దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావు
పరిటాల సునీతా
ప్ర‌తిపాటి పుల్లారావు
కామినేని శ్రీ‌నివాస‌రావు

** కాపు

గంటా శ్రీ‌నివాస‌రావు
పి.నారాయణ
నిమ్మ‌కాయ‌ల చినరాజప్ప
పి.మాణిక్యాలరావు


**బీసీ

కేఇ కృష్ణ మూర్తి
యనమల రామ‌కృష్ణుడు
అచ్చెనాయుడు
చింత‌కాయల‌ అయ్యన్న పాత్రుడు
కాలువ శ్రీనివాసులు
పితాని స‌త్య‌నారాయ‌ణ‌
కొల్లు రవీంద్ర
కిమిడి కళా వెంకట రావు(T కాపు)

**రెడ్డి

ఆదినారాయణ రెడ్డి
అమరనాథ్ రెడ్డి
అఖిల ప్రియా
సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి.

**ఎస్సీ

నక్కా ఆనంద్ బాబు (మాల)
జవహర్ (మాదిగ)

**వైశ్య

సిద్ధ రాఘవ రావు

**ఓసీ వెలమ

సుజయ కృష్ణ రంగారావు
Tags:    

Similar News